STOCKS

News


స్వల్ప నష్టాల్లో పసిడి

Monday 31st December 2018
Markets_main1546240130.png-23331

అమెరికా చైనాల మ‌ధ్య వాణిజ్య యుద్ధ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌చ్చ‌నే అంచ‌నాల నేప‌థ్యంలో సోమ‌వారం ప‌సిడి ధ‌ర‌ స్వ‌ల్పంగా న‌ష్ట‌పోయింది. ఆసియా ట్రేడింగ్లో ఉదయం సెషన్లో 3.50డాలర్లకు పైగా నష్టపోయింది. డాలర్ ఇండెక్స్ వారం రోజుల కనిష్టం నుంచి కోలుకోవడం కూడా పసిడి ట్రేడింగ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. చైనా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన ట్వీట్లో పేర్కోనడంతో ప్రపంచ ఈక్వీటీ మార్కెట్లకు కలిసొస్తుందనే అంచనాలు పసిడిని నష్టాల వైపుకు మళ్లించాయి. మధ్యాహ్నం 12:15ని.లకు ఔన్స్ పసిడి ధర 2డాలర్లు నష్టపోయి 1,281 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలు, అమెరికా మార్కెట్ల ఒడిదుడుకుల ట్రేడింగ్‌, డాలర్‌ ఇండెక్స్‌ వారం రోజుల కనిష్టానికి పతనం తదితర కారణాలతో గత శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో  పసిడి ధర 6నెలల తర్వాత మొదటిసారి 1280డాలర్లపై ముగిసింది.
దేశీయంగా స్వల్ప నష్టాల్లోనే:‍‍‍-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధర స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. డాలర్ మారకంలో రూపాయి బలపడటం దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధర నష్టాల బాట పట్టించింది. మధ్యాహ్నం 12:15ని.లకు 10గ్రాముల పసిడి ధర రూ.39లు నష్టపోయి రూ.31559.00ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత శుక్రవారం రాత్రి పసిడి ధర రూ.115లు నష్టపోయి రూ.31598.00 వద్ద ముగిసింది.



You may be interested

ఫార్మా షేర్ల ర్యాలీకి ‘‘సన్‌ ఫార్మా’’ అండ

Monday 31st December 2018

3.50శాతం లాభపడిన సన్‌ఫార్మా ఆరంభ లాభాల్ని కోల్పోయిన మార్కెట్లో సోమవారం ఫార్మా రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో 1శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ గతముగింపు(8,814.20)తో పోలిస్తే 0.75శాతం లాభంతో 8881.05ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సన్‌ఫార్మా అత్యధికంగా 3.50శాతం ర్యాలీ లాభపడి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌కు దన్నుగా నిలుస్తోంది. అలాగే పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, దివిస్‌ ల్యాబ్స్‌

మెటల్ షేర్ల ర్యాలీ

Monday 31st December 2018

ఉక్కు షేర్ల ర్యాలీ అండతో సోమవారం ఉదయం సెషన్‌లో మెటల్ షేర్లు లాభాల బాట పట్టాయి. అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం అమెరికా అధికారులను కోరినట్లు శుక్రవారం కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గొచ్చనే అంచనాలు షేర్ల లాభాల ట్రేడింగ్‌కు కారణమయ్యాయి.  నేటి ట్రేడింగ్‌లో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్

Most from this category