STOCKS

News


5 డాలర్లు తగ్గిన బంగారం..

Friday 21st December 2018
Markets_main1545373799.png-23136

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర  శుక్రవారం తగ్గింది. ఔన్స్‌ బంగారం ధర 5.85 డాలర్ల  క్షీణతతో 1,262.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి మునపటి ముగింపు (గురువారం) స్థాయి 1,267.9 డాలర్లుగా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముంగింపు 95.72తో పోలిస్తే 0.2 శాతం పెరుగుదలతో 95.91 వద్ద ట్రేడవుతోంది. 

దేశీయంగా చూస్తే..
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగానే దేశీయంగా కూడా బంగారం ధర శుక్రవారం తగ్గింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.76 క్షీణతతో 31,235 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర ఒకానొక సమయంలో రూ.31,339 గరిష్ట స్థాయిని కూడా తాకింది. కాగా బంగారం మునపటి (గురువారం) ముగింపు స్థాయి రూ.31,159గా ఉంది. 
 



You may be interested

ఏడాది కనిష్టానికి క్రూడ్‌ పతనం

Friday 21st December 2018

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గురువారం దాదాపు 5 శాతానికి పైగా పతనమయ్యాయి. దీంతో క్రూడ్‌ ధర ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఓవర్‌సప్లై, ఆయిల్‌ డిమాండ్‌ వృద్ధి బలహీనంగా ఉండొచ్చనే అంచనాలు, ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు, స్టాక్‌ మార్కెట్ల పతనం వంటి అంశాలు ఇందుకు కారణం.  ఇంటర్నేషనల్‌ బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 2.89 డాలర్లు లేదా 5.05 శాతం క్షీణతతో 54.35 డాలర్లకు తగ్గింది.

సెన్సెక్స్‌ 400 పాయింట్లు క్రాష్‌

Friday 21st December 2018

నిఫ్టీ 130 పాయింట్లు డౌన్‌ 10,850 దిగువకు ఇండెక్స్ శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన ఇండియన్‌ మార్కెట్‌ తర్వాత వేగంగా పతనమైంది. ఒకానొక సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా పడిపోతే, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 11:16 సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌ 376 పాయింట్ల నష్టంతో 36,055 వద్ద, నిఫ్టీ 128 పాయింట్ల నష్టంతో 10,823 వద్ద ట్రేడవుతున్నాయి. ఫెడ్‌ రేటు పెంపు వల్ల గురువారం

Most from this category