STOCKS

News


పసిడి తగ్గుముఖం

Thursday 14th March 2019
Markets_main1552543395.png-24596

డాలర్‌ రికవరీతో  బ్రెగ్జిట్‌ అనిశ్చితి ఓ కొలిక్కి రావడంతో పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,309.50 డాలర్ల వద్ద ప్రారంభించింది. లాంటి ఒప్పందం లేకుండా బ్రిటన్‌ యూరోపియన్ యూనియన్(ఈయూ)నుంచి వైదొలగాలనే ప్రతిపాదనను దిగువసభ 'హౌస్ ఆఫ్ కామన్స్‌'లో ఎంపీలు తిరస్కరించడంతో  వరుసగా 4రోజులు నష్టపోయిన డాలర్‌ ఇండెక్స్‌ నేడు రీవకరీ బాట పట్టింది. ఫలితంగా 7.50డాలర్లు నష్టపోయి 1,302.65 డాలర్ల వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.11:00కు ని.లకు పసిడి గత ముగింపు(1,309.30 డాలర్లు)తో పోలిస్తే 5డాలర్లు నష్టపోయి 1,304 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ఈసారి అంచనాల నేపథ్యంలో యూఎస్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడంతో బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర రెండు వారాల గరిష్టస్థాయి 1,309.30 వద్ద ముగిసింది.
దేశీయంగా స్వల్పంగా నష్టాల్లో :-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి భారీగా నష్టపోయినప్పటికీ, దేశీయంగా మాత్రం స్వల్పంగా క్షీణించింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.81.00లు నష్టపోయి రూ.32126.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

సమాజం కోసం ప్రేమతో రూ.52,700 కోట్లు

Thursday 14th March 2019

విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ తాజా కేటాయింపులు విప్రోలోని తన వాటాల్లో 34 శాతం న్యూఢిల్లీ: విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ మరో సారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవ కోసం మరింత సంపదను కేటాయించారు. విప్రోలోని తన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రేమ్‌జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలున్నాయని, వీటి మార్కెట్‌

ఎఫ్‌పీఐల ప్రవాహం పెరుగుతుంది!

Thursday 14th March 2019

మార్కెట్‌ నిపుణుడు అడ్రైన్‌ మొవత్‌ దేశీయ మార్కెట్లోకి విదేశీనిధుల ప్రవాహం ఈ ఏడాది మరింత పెరుగుతుందని వర్దమాన ఈక్విటీ మార్కెట్ల నిపుణుడు అడ్రైన్‌ మొవత్‌ అభిప్రాయపడ్డారు. భారత మార్కెట్‌ స్థూల పరిస్థితులు మెరుగయ్యాయని చెప్పారు. దేశ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌పై ఎలాంటి సందేహాలు లేవన్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం కీలక పాజిటివ్‌ అంశమని చెప్పారు. దీంతో ఆర్‌బీఐ ఈ ఏడాది మరిన్ని మార్లు రేట్‌కట్‌ ప్రకటించే ఛాన్సులున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారన్నారు. గతేడాది

Most from this category