STOCKS

News


స్థిరంగా పసిడి

Tuesday 7th August 2018
Markets_main1533620080.png-19007

ముంబై:- అంతర్జాతీయంగా పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధ భయాలతో పాటు, ఆసియాలోని మార్కెట్లు మిశ్రమ ట్రేడింగ్‌ పసిడి ధర స్థిరమైన ర్యాలికి కారణమవుతున్నాయి.  ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర భారత కాలమానం ప్రకారం గం.10:15ని.లకు 0.70 డాలర్లు స్వల్పంగా పెరిగి  1,218.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో అమెరికా వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ 95.35కు ఎగిసింది. క్రితం రాత్రి అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాల ముగింపు నేపథ్యంలో అక్కడ ఔన్స్‌ పసిడి 1,217.70 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగా స్థిరంగానే:-
అంతర్జాతీయంగా ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.1 నష్టపోయి రూ.29486.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.క్రితంరాత్రి ఎంసీఎక్స్‌లో రూ.29487ల వద్ద ముగిసింది.



You may be interested

నష్టాల్లోకి మార్కెట్‌..

Tuesday 7th August 2018

స్టాక్‌ మార్కెట్‌ లాభాలు ఆవిరైపోయాయి. మంగళవారం సరికొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద ప్రారంభమైన మార్కెట్లు.. ఆ తర్వాత మళ్లీ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. మార్నింగ్‌ సెషన్‌లో సెనెక్స్‌ 37,840 మార్క్‌కు పైన, నిఫ్టీ 11,420 మార్క్‌కు పైగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 37,849 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11,423 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా డౌన్‌ లాభాల్లో ప్రారంభమైన

‘పెప్సీ’లో ముగియనున్న ఇంద్రానూయి శకం

Tuesday 7th August 2018

న్యూయార్క్‌: భారతీయ మహిళలు వ్యాపార నిర్వహణలోనూ దిట్టలు అని నిరూపించిన మహిళ... ప్రపంచ స్థాయి కంపెనీని సైతం విజయవంతంగా భవిష్యత్తులోకి నడిపించగలరని నిరూపించిన నారీశక్తి... ప్రపంచ పారిశ్రామిక రంగంలో అసాధారణ మహిళగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయి (62) పెప్సీకో కంపెనీ నాయకత్వ బాధ్యతల్ని విడిచిపెట్టబోతున్నారు. శీతలపానీయాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్‌ ఇంద్రానూయి త్వరలో

Most from this category