News


స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 11th June 2019
Markets_main1560232562.png-26225

ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పటికీ.., పసిడి ధర మంగళవారం లాభపడింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4 డాలర్లు పెరిగి 1,333.75 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెక్సికో దిగుమతులపై అమెరికా పన్ను విధింపు విరమించుకోవడంతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ కనిష్టస్థాయిల నుంచి రివకరి కావడంతో రాత్రి అమెరికా మార్కెట్లో 16 డాలర్లు నష్టపోయింది. ఫలితంగా పసిడి 8రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడినట్లైంది. గత రెండు నెలల్లో ఒకరోజులో  పసిడి ఇంత స్థాయిలో పసిడి పతనం కావడం ఇదే తొలిసారి. రాత్రి అమెరికా మార్కెట్లో 16డాలర్లు (1శాతం) నష్టపోయి 1,329.30 డాలర్ల వద్ద స్థిరపడింది. 
దేశీయంగా అక్కడక్కడే:- 
ఇక దేశీయంగా పసిడి ఫ్యూచర్ల ధర అక్కడక్కడే ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం ఇందుకు కారణమైంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.16.00లు నష్టపోయి రూ.32676.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ 19 పైసలు నష్టపోవడంతో రాత్రి ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.32660 వద్ద స్థిరపడింది. 



You may be interested

జీవితకాల గరిష్టానికి చేరువలో టీసీఎస్‌

Tuesday 11th June 2019

దేశ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్) షేర్లు మంగళవారం ఉదయం సెషన్స్‌లో ఆల్‌టైంకి చేరువలో ట్రేడ్‌ అవుతున్నాయి. క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 2.5శాతం లాభపడిన ఈ షేర్లు నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.2237.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు  మొగ్గు చూపడంతో 1.25శాతం లాభపడి రూ.2257.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. కాగా ఈ

రూ.25.43 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు

Tuesday 11th June 2019

ఈక్విటీ లింక్డ్‌ స్కీమ్స్‌తో పెరుగుతున్న పెట్టుబడులు  ఎఫ్‌ఎమ్‌పీల నుంచి జోరుగా ఉపసంహరణ యాంఫీ వెల్లడి   న్యూఢిల్లీ: ఈక్విటీ లింక్డ్‌ స్కీమ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెరగడంతో మే నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల ఆస్తులు పెరిగాయి. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్ల సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లు తగ్గాయి. ఎఫ్‌ఎమ్‌పీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, ఎస్సెల్‌ గ్రూప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వంటి కంపెనీల సంక్షోభం కారణంగా ఇటీవల కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌పై పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిడి కొనసాగుతోందని యాంఫీ(అసోసియేషన్‌ ఆఫ్‌

Most from this category