News


పెరిగిన పసిడి .!

Monday 16th July 2018
Markets_main1531717732.png-18337

ముంబై: గతవారం ముగింపులో ఏడు నెలల కనిష్టానికి పతనమైన పసిడి ధర ఈ వారం ప్రారంభంలోనే రికవరీ బాట పట్టింది. భారత కాలమానం గం.10:21ని.లకు ఆసియా ట్రేడింగ్‌లో సోమవారం ఔన్స్‌ పసిడి 2.40డాలర్లు పెరిగి 1,243.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు చైనా జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో పలు ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌తో పాటు డాలర్‌ బలహీనత పసిడి పెరుగుదలకు కలిసొచ్చాయి. నేడు ఆసియా ట్రేడింగ్‌లో 1,240.9 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 3డాలర్లు లాభపడి 1,244.6వద్ద చేరుకుంది. డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడంతో గతవారంలో పసిడి ఔన్స్‌ 14డాలర్ల మేర పతనమై 1,241.20 వద్ద ముగిసింది.
దేశీయంగానూ అదే బాటలో:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే పసిడి ధరలు దేశీయంగానూ రీకవరీ బాట పట్టాయి. గతవారంలో రూ.480లు నష్టపోయిన పసిడి నేడు లాభాల బాట పట్టింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.66.00లు పెరిగి రూ.30171.00ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. గత వారం మార్కెట్‌ చివరిరోజైన శుక్రవారం  ట్రేడింగ్‌ ముగిసే సమయానికి రూ.42లు నష్టపోయి రూ.30105ల వద్ద ముగిసింది.



You may be interested

నర్నోలియా మిడ్‌టర్మ్‌ సిఫార్సులు

Monday 16th July 2018

వచ్చే 3- 6 నెలల కాలంలో 20 శాతం వరకు రాబడినిచ్చే 5 స్టాకులను నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రికమండ్‌ చేస్తోంది. 1. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 245. స్టాప్‌లాస్‌ రూ. 179. ఆల్‌టైమ్‌ హైని తాకిన అనంతరం ఒక్కపెట్టున వేగంగా ఏడాది కనిష్ఠస్థాయిలకు పడిపోయింది. ఈ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు పొంది గత ఐదేళ్లుగా రూ. 200- 286 రేంజ్‌లోనే తిరుగుతోంది. ప్రస్తుతం ఈ రేంజ్‌

స్వల్పంగా తగ్గిన రూపాయి.

Monday 16th July 2018

తన మునుపటి ముగింపు 68.52తో పోలిస్తే రూపాయి విలువ సోమవారం స్వల్ప నష్టంతో 68.55 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం మార్కెట్‌ అనంతరం ఎగుమతులు, దిగుమతుల గణాంకాలు వచ్చాయి. వీటి ప్రకారం.. భారత్ ఎగుమతులు జూన్‌లో 17.57 శాతం పెరిగి 27.7 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో అధిక ముడి చమురు రేట్ల కారణంగా దిగుమతుల భారం పెరిగి.. వాణిజ్య లోటు మూడున్నరేళ్ల గరిష్ట స్థాయి 16.6 బిలియన్ డాలర్లకు

Most from this category