STOCKS

News


4నెలల కనిష్టం వద్దే పసిడి ధర

Wednesday 24th April 2019
Markets_main1556087076.png-25315

డాలర్‌ బలపడటం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కారణంగా ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం 4నెలల కనిష్టం వద్దే స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్పలాభంతో 1,271 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల అమెరికా విడుదల చేసిన గృహనిర్మాణ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో ఆ దేశంలో ఆర్థిక మందగమన ఆందోళనలు తగ్గుముఖం పట్టాయనే సూచిస్తుంది. పటిష్టమైన ఆర్థికగణాంకాల నమోదు కారణంగా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ మూడువారాల గరిష్టం 97.80 స్థాయిని తాకింది. ‘‘డాలర్‌ ఇండెక్స్‌ బలపటడం, స్టాక్‌ మార్కెట్‌, బాండ్‌ మార్కెట్‌ ర్యాలీ చేయడంతో పసిడి ట్రేడర్లు కొనుగోళ్లకు వెనకడుగువేస్తున్నారు. ట్రేడర్లు అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు, రాజకీయ మార్పుల కోసం ఎదురుచూస్తున్నారు. అంత వరకు పసిడి ధర కనిష్టస్థాయిలోనే ట్రేడ్‌ అవుతుంది’’ అని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు.
దేశీయంగానూ స్థిరంగా పసిడి:- 
దేశీయం మార్కెట్‌లోనూ పసిడి అక్కడక్కడే ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.7.00 స్వల్ప నష్టంతో రూ.31555.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి అస్థితర, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి కనిష్టస్థాయిల్లో ట్రేడవుతుండటం పసిడి ర్యాలీకి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి.You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Wednesday 24th April 2019

స్వల్పలాభాల మార్కెట్‌ ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ అరశాతం నష్టపోయింది. ఇండెక్స్‌లోని జిందాల్‌ స్టీల్‌ అత్యధికంగా 2శాతం నష్టపోగా, వేదాంత, 1.50శాతం, ఏపిల్‌ అపోలో 1శాతం, నాల్కో, హిందాల్కో 0.75శాతం, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు అరశాతం క్షీణించాయి. హిందూస్థాన్‌ జింక్‌, మెయిల్‌, ఎన్‌ఎండీసీ షేర్లు పావుశాతం పతనమయ్యాయి. అలాగే సెయిల్‌ 3.50శాతం, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌ 2.50శాతం,

రెడ్‌బస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ

Wednesday 24th April 2019

న్యూఢిల్లీ: బస్‌ టికెటింగ్‌ సేవల సంస్థ రెడ్‌బస్‌ ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించింది. తమ బ్రాండ్‌ తరఫున అన్ని రకాల వినియోగదారుల ప్రచార కార్యక్రమాల్లో ఇక ధోనీ దర్శనమిస్తారని తెలిపింది. త్వరలోనే మొదటి ప్రచార కాన్సెప్ట్‌ను ప్రచారంలోకి తీసుకుకొస్తామని ప్రకటించింది. 

Most from this category