STOCKS

News


నాలుగునెలల కనిష్టానికి పసిడి

Wednesday 17th April 2019
Markets_main1555484193.png-25182

ప్రపంచమార్కెట్లో డాలరు బలోపేతం అయిన నేపథ్యంలో పసిడి ధర మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లో 4నెలల కనిష్టం 1,273 డాలర్ల వద్దకు పడిపోయింది. అయితే బుధవారం ఈ స్థాయి నుంచి స్వల్పంగా కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ఆసియాలో ఉదయం గం.11:15ని.లకు గత రాత్రి ధరతో పోలిస్తే ఔన్స్‌ పసిడి ధర స్వల్పంగా లాభపడి 1,281.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా రూ.308 క్షీణత:- 
అంతర్జాతీయంగా పసిడి 4నెలల కనిష్టానికి పతనమైన నేపథ్యంలో దేశీయంగా పసిడి ఫ్యూచర్లపై ఈ ప్రభావం కన్పించింది. నిన్న రాత్రి దేశీయ ఎంసీక్స్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.308లు క్షీణించి రూ.31548.00ల వద్ద స్థిరపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం పసిడి క్షీణతకు అడ్డుకోలేక పోవడం గమనార్హం. ఇక నేడు మహావీర్‌ జయంతి సందర్భంగా ఎంసీఎక్స్‌ మార్కెట్‌ పనిచేయదు.



You may be interested

11,800 వద్ద పుట్‌రైటింగ్‌...బుల్లిష్‌నెస్‌కు సంకేతం

Wednesday 17th April 2019

మంగళవారంనాటి ర్యాలీ సమయంలో నిఫ్టీ 11,800 స్ర్టయిక్‌ వద్ద పెద్దస్థాయిలో పుట్‌రైటింగ్‌ జరగడం...ట్రేడర్లు బుల్లిష్‌గా వున్నారనడానికి సంకేతమని టెక్నికల్‌ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు ‘ఇన్‌ ద మనీ’ స్ర్టయిక్‌ అయిన 11,800 వద్ద పెద్ద ఎత్తున ట్రేడర్లు పుట్స్‌ విక్రయించినట్లు, అలాగే 11,700 స్ర్టయిక్‌ వద్ద కూడా గణనీయమైన స్థాయిలో పుట్‌ రైటింగ్‌ జరిగినట్లు డెరివేటివ్‌ డేటా వెల్లడిస్తున్నది. ఏ స్ర్టయిక్‌ వద్ద పుట్‌ ఆప్షన్ల విక్రయం ఎక్కువగా జరిగితే ఆ

11,700పైన... 12,000 స్థాయికి నిఫ్టీ

Wednesday 17th April 2019

గత 8 ట్రేడింగ్‌ సెషన్లుగా 11,550–11,760 పాయింట్ల శ్రేణి మధ్య కన్సాలిడేట్‌ అయిన నిఫ్టీ ఎట్టకేలకు బ్రేక్‌అవుట్‌ను సాధించగలగడం పాజిటివ్‌గా పరిణామంగా టెక్నికల్‌ అనలిస్టులు పేర్కొంటున్నారు. మంగళవారం నిఫ్టీ 11,810 పాయింట్ల గరిష్టస్థాయి వద్ద కొత్త రికార్డును నెలకొల్పి 97 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో డెయిలీ టెక్నికల్‌ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పర్చినందున, తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుందని అనలిస్టులు వివరిస్తున్నారు. మంగళవారంనాటి గ్యాప్‌అప్‌

Most from this category