STOCKS

News


పసిడికి బలాన్నిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి!

Monday 25th March 2019
Markets_main1553501518.png-24783

- వారంలో 17 డాలర్ల పెరుగుదల - కలసివస్తున్న డాలర్‌ బలహీన ధోరణి
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌- నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) పసిడి ధర శుక్రవారం (22వ తేదీ)తో ముగిసిన వారంలో 17 డాలర్లు పెరిగి 1,319 డాలర్లకు చేరింది. రేటు (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) పెంచని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- ఫెడ్‌ రిజర్వ్‌, అమెరికా వృద్ధి ధోరణి మందగమనంలో ఉందని విశ్లేషణ, డాలర్ ఇండెక్స్‌ బలహీనత (96), దీనికితోడు కొనసాగుతున్న అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ తీవ్రత, దీనితో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై వీడని అనిశ్చితి వంటి అంశాలు పసిడి బలానికి తోడవుతున్నాయి. నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) 1,200 డాలర్ల  నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, తిరిగి రెండు వారాల నుంచి ఆ పటిష్ట మద్దతుపైనే కొనసాగుతోంది. సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందన్నది నిపుణుల విశ్లేషణ. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. 

దేశంలో 32-33 వేల మధ్య స్థిరీకరణ ...
కాగా డాలర్‌ మారకంలో​ రూపాయి (22వ తేదీ ముగింపు 68.95) ఒడిదుడుకులు, డాలర్‌ కదలికలపై అనిశ్చితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000-33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 32,140 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్‌ మార్కెట్‌లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,810, రూ.31,250 వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా పసిడి భారీగా పెరిగినా, దేశీయంగా వారంవారీగా ధరలు దాదాపు అక్కడక్కడే ఉన్నాయి. రూపాయి బలోపేత ధోరణి దీనికి కారణం. 



You may be interested

ఒడిదుడుకుల వారం..!

Monday 25th March 2019

- గురువారం (28న) మార్చి సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు - ద్రవ్య లోటు డేటా, విదేశీ రుణ గణాంకాలు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి డేటా ఈవారంలోనే.. - అమెరికా–చైనాల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలు, బ్రెగ్జిట్‌ అంశాలపై దృష్టి - ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందన్న సామ్కో సెక్యూరిటీస్‌ ముంబై: మార్చి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సిరీస్‌ ముగింపు, స్థూల ఆర్థిక అంశాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్‌ఐఐ) నిర్ణయాలు ప్రధానంగా ఈవారంలో దేశీ స్టాక్‌

ఆఖరి గడియల్లో ఈ తప్పులొద్దు

Monday 25th March 2019

పన్ను ఆదా ఒక్కటే కాదు.. రాబడులూ కీలకమే ముందు నుంచే ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు ఈక్విటీ సాధనాల్లో ఒకేసారి కంటే సిప్‌ బెటర్‌ ఉన్నదంతా ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే అధిక రిస్క్‌ పెట్టుబడి సాధనానికి రిస్క్‌ను చూడాలి హడావిడితో అధిక రిస్క్‌కు వెళ్లొద్దు అత్యవసర నిధులను ముట్టొద్దు పన్ను ఆదా కోసం... పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, ఎన్‌ఎస్‌సీ, పన్ను ఆదా ఎఫ్‌డీలు, యులిప్‌లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు... వీటిల్లో ఏది అన్న ఎంపిక అంత సులభం కాదు.

Most from this category