STOCKS

News


కీలక నిరోధం దిగువన పసిడి

Tuesday 9th April 2019
Markets_main1554792400.png-25023

వారమంతా 1,300 డాలర్ల దిగువనే!
- వాణిజ్య చర్చలపై సానుకూలత
- ఆర్థిక వృద్ధిపై ఆశావాదం
- డాలర్‌ ఇండెక్స్‌ పటిష్ట ధోరణి
- ఈక్విటీల్లోకి నిధులు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- నైమెక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారమంతా పడిసి ఔన్స్‌ (31.1గ్రా) ధర 1,300 డాలర్ల దిగువనే కొనసాగింది. వారం చివరకు గతంతో పోల్చితే 10 డాలర్ల నష్టంతో 1,296 వద్ద ముగిసింది.  1,300 డాలర్లస్థాయి పసిడికి కీలక నిరోధం కావడం గమనార్హం. నిజానికి అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపుపై అనిశ్చితి పసికి బలోపేతం కావాల్సి ఉంది. అయినా, యల్లో మెటల్‌ నుంచి ఆ స్థాయి సానుకూల ధోరణి కనబడకపోవడానికి పలు కారణాలను నిపుణులు పేర్కొంటున్నారు. 
- వాణిజ్య అంశాలకు సంబంధించి చైనాతో జరుగుతున్న చర్చలు త్వరలో సానుకూలంగా ముగిసే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దీనితో వాణిజ్య యుద్ధం సమసిపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు చైనా ఆర్థిక గణాంకాలు కూడా సానుకూలంగా నమోదయ్యాయి.  ఇది వృద్ధి అంచనాలకు కొంత సానుకూలమైంది.  అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గినట్లు గణాంకాలు వెలువడ్డం గమనార్హం. 
- ఆయా అంశాలు డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతానికి కారణమయ్యాయి. ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ 97 స్థాయిని తాకింది. ఇండెక్స్‌ 96-97 డాలర్ల శ్రేణిలో తిరిగింది. 
- భారత్‌సహా పలు ఆసియా దేశాల్లో ఈక్విటీలు జీవితకాల గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. బంగారంలోకి కాకుండా ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం బాగుందన్న అంచనాలు ఉన్నాయి. 
- తాజా పరిస్థితుల ప్రకారం... సమీప 15 రోజుల్లో పసిడి ధర 1,350 డాలర్ల స్థాయిని అధిగమించడం కష్టమేనన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే 1,250 డాలర్ల లోపునకూ పడిపోవకపోవచ్చన్నది విశ్లేషణ. 
- ఇక భారత్‌ విషయానికి వస్తే, అంతర్జాతీయ బలహీనతలకు తోడు దేశీయంగా రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును ఇక్కడ అడ్డుకుంటోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 69.22 వద్ద ముగిసింది. ఇక భారత్‌ ఫ్యూచర్స్‌- మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.31,873 వద్ద ముగిసింది



You may be interested

జెట్ విక్రయం షురూ!!

Tuesday 9th April 2019

- బిడ్స్‌ ఆహ్వానిస్తూ ఎస్‌బీఐ ప్రకటన - సమర్పించడానికి ఆఖరు తేది ఏప్రిల్‌ 10 - 31.2 శాతం - 75 శాతం దాకా వాటాల విక్రయం - లుఫ్తాన్సా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆసక్తి ముంబై, న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌

కాలంతోపాటే మారాలి ప్రణాళిక

Tuesday 9th April 2019

మార్చుకోకపోతే లక్ష్యాలకు దూరం! రిటైర్మెంట్‌ అవసరాల కోసం అధిక కేటాయింపులు అత్యవసరాలకూ అదనపు నిధి ఈక్విటీలకు అగ్ర ప్రాధాన్యం డెట్‌ సాధనాల్లో కొంత మేర మారుతున్న పరిస్థితులతో ఆర్థిక ప్రణాళికల్లోనూ మార్పులు రుణం తీసుకొని ఇన్వెస్ట్‌ చేయొద్దు. ఆర్జిస్తున్న దాని కంటే తక్కువే ఖర్చు పెట్టు. ఇవి తరచుగా వినిపించే మనీ సూత్రాలు. వీటికి కట్టుబడి నడుచుకుంటే ఆర్థిక వ్యవహారాలు తప్పుదోవలో వెళ్లకుండా చూసుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక విషయంలో ఇలాంటివే ఎన్నో సాధారణ సూత్రాలు ఉన్నాయి. వీటిని కాలంతోపాటే

Most from this category