STOCKS

News


డాలర్‌ రివకరీ : నష్టాల్లో పసిడి ధర

Wednesday 28th November 2018
Markets_main1543387299.png-22430

ఈ వారంలో రెండు రోజులు స్థిరమైన ర్యాలీ చేసిన పసిడి ధర బుధవారం తగ్గుముఖం పట్టింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడం ఇందుకు కారణమైంది. గతరాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌ సమావేశంలో ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ రిచర్డ్ క్లారిడా మాట్లాడుతూ ‘‘ఫెడ్‌ క్రమక్రమంగా వడ్డీరేట్లను పెంచాలి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతైన అవసరమని’’ తెలిపారు. వడ్డీరేట్లపై పెంపుకు కొంతమేర స్పష్టత రావడంతో రాత్రి అమెరికా మార్కెట్లో డాలర్‌ ఇండెక్స్‌ 2వారాల గరిష్టస్థాయి(97.50)ని తాకింది. డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ పసిడి ధరపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఫలితంగా రాత్ని అమెరికా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 9డాలర్లు నష్టపోయి 1,219.90 డాలర్ల వద్ద ముగిసింది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో 1,220.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆసియాలో డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా పసిడి ఇంట్రాడేలో 1డాలర్లు నష్టపోయి 1218.90 వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధర గతముగింపు(1,219.90డాలర్లు) పోలిస్తే 0.90డాలర్లు నష్టపోయి 1219 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా పెరుగుదల:-
డాలర్‌ మారకంలో రూపాయి రోజురోజూకు బలపడుతుండంతో దేశీయ మార్కెట్లోనూ పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీక్స్‌లో ఉదయం గం.11:00ని.లకు 10గ్రాముల పసిడి రూ.78.00లు నష్టపోయి రూ.30324ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకం విలువలో రూపాయి బలపడటంతో రూ.145లు తగ్గి రూ.30402ల వద్ద ముగిసింది.



You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌పై వచ్చేనెల్లో పార్లమెంటరీ కమిటీ సమీక్ష

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ పరిస్థితులను సమీక్షించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఆర్థికాంశాలు) డిసెంబర్ 3 నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ఈ సందర్భంగా గ్రూప్‌తో పాటు ఇతర ఆర్థిక సంస్థల అధికారులతో కూడా కమిటీ భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎం వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఈ ప్యానెల్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

కేంద్రం- ఆర్‌బీఐ మధ్య మళ్లీ ఉద్రిక్తత?

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: రుణ మంజూరీపై నియంత్రణలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో కొన్నింటిని ఆ ఆంక్షల పరిధి నుంచి తప్పించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)పై కేంద్రం ఒత్తిడి తేనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే వాటి నిర్వహణ నిబంధనలను కూడా సమీక్షించాలని కోరనుంది. డిసెంబర్‌ 14న 18 మంది సభ్యుల బోర్డ్‌ సమావేశాల్లో ఈ  అంశంపై చర్చ జరగనుందని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనితో ఈ సమావేశాల సందర్భంగా  కేంద్రం-ఆర్‌బీఐ

Most from this category