STOCKS

News


స్థిరంగా ముగిసిన పసిడి

Friday 19th April 2019
Markets_main1555663883.png-25230

శుక్రవారం ఆసియాలో 1.10డాలరు స్వల్ప లాభంతో 1,277.90 డాలర్ల వద్ద క్లోజయ్యింది . గత రాత్రి న్యూయార్క్‌ ట్రేడింగ్‌లో పసిడి ధర స్థిరంగా ముగిసింది.నేడు గుడ్‌ఫ్రైడ్‌ సందర్భంగా యూరప్‌, అమెరికా మార్కెట్లు సెలవు కావున అక్కడ పసిడి ట్రేడింగ్‌ జరగదు.  యూరప్‌ తయారీరంగ గణాంకాలు బలహీనంగా నమోదు కావడం పసిడి స్ధిరమైన ముగింపునకు కారణమైంది. అయితే గురువారం రాత్రి అమెరికా డాలరు ఇండెక్స్‌ ర్యాలీ జరిపినా, పసిడి ధర 4నెలల కనిష్టం స్థాయి వద్ద స్థిరంగా ట్రేడయ్యింది. ఇక ఈ వారంలో పసిడి మొత్తం 12.70డాలర్లు(0.98శాతం) నష్టపోయింది. అలాగే ఇది పసిడికి వరుసగా నాలుగో వారమూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ‘‘యూరప్‌ తయారీ గణంకాలు డాటా ఆశించి స్థాయిలో నమోదు కాలేదు. అలాగే వారాంతం ఒకరోజు ముందే రావడంతో పసిడి ఫ్యూచర్లో షార్ట్‌ కవరింగ్‌ జరగాల్సింది. అయితే రాత్రి అమెరికా బలమైన రిటైల్‌ గణాంకాలను విడుదల చేయడంతో డాలర్‌ ఇండెక్స్‌ 97స్థాయికి అందుకొని పసిడి ప్యూచర్ల ర్యాలీకి అడ్డుగా నిలిచింది’’ అని ఆర్‌బీసీ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ జార్జ్‌ అభిప్రాయపడ్డారు.
దేశీయంగానూ స్థిరమైన ముగింపే:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్‌లో పసిడి ధర గురువారం స్థిరంగా ముగిసింది. ఎంసీఎక్స్‌లో నిన్నరాత్రి 10గ్రాముల పసిడి ధర రూ.17ల స్వల్ప నష్టంతో రూ.31463.00ల వద్ద స్ధిరపడింది. రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 25పైసలు బలపడటం పసిడికి ప్రతికూలంగా మారింది. ఇక దేశీయంగా సైతం పసిడి ఈవారంలో భారీగా నష్టపోయింది. గత వారం ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం ముగింపు ధర(రూ.31884)తో పోలిస్తే ఈ వారంలో రూ.421లు నష్టపోయి రూ.31463.00 వద్ద ముగిసింది. 



You may be interested

పీఎస్‌యూలపై పెరిగిన ఆసక్తి

Friday 19th April 2019

మార్నింగ్‌స్టార్‌ ప్రతినిధి కౌస్తుభ్‌ బెలాపుర్కర్‌ గతనెల ఈక్విటీల్లో రిటైలర్ల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని, ఫండ్‌ మేనేజర్లు ఎక్కువగా పీఎస్‌యూలు, కన్జూమర్‌ స్టాకులపై మక్కువ చూపారని మార్నింగ్‌స్టార్‌ ఫండ్‌ రిసెర్చ్‌ హెడ్‌ కౌస్తుభ్‌ బెలాపుర్కర్‌ చెప్పారు. రెండు నెలలుగా ఎఫ్‌ఐఐల హవా పెరిగిందని, ఈ సమయంలో డీఐఐలు కాస్త నెమ్మదించాయని చెప్పారు. మార్చిలో ఫండ్‌మేనేజర్లు ఎక్కువగా ఈటీఎఫ్‌ల రూపంలో పీఎస్‌యూల్లో పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చారన్నారు. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, కోల్‌ఇండియా, ఐఓసీ వంటి ప్రభుత్వ

టాటా మోటర్స్‌ షేరులో ఎందుకింత ర్యాలీ?

Friday 19th April 2019

గత కొద్ది కాలంగా టాటామోటర్స్‌ షేరు దూసుకుపోతోంది. ఈ ఒక్క నెల్లోనే షేరు దాదాపు 25 శాతం మేర లాభపడింది. ఈ నేపథ్యంలో షేరును కేవలం రెండు శక్తులే కొనుగోలు చేస్తున్నాయని, అందుకే ఇంతలా ర్యాలీ జరుపుతోందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. టాటామోటర్స్‌ కంపెనీ మౌలికంగా బలమైనదే, పాసింజర్‌ వాహనాల పోర్టుఫోలియో స్థిర ప్రదర్శన చూపుతోంది. కమర్షియల్‌ వాహనాలు సైతం బాగానే విక్రయిస్తోంది. అయితే ఒక్కమారుగా షేరు ధరలో ఇంత ర్యాలీ

Most from this category