News


1280డాలర్ల పైన పసిడి ముగింపు

Saturday 29th December 2018
Markets_main1546065267.png-23309

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 6నెలల తర్వాత మొదటిసారి 1280డాలర్లపై ముగిసింది. ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలు, అమెరికా మార్కెట్ల ఒడిదుడుకుల ట్రేడింగ్‌, డాలర్‌ ఇండెక్స్‌ వారం రోజుల కనిష్టానికి పతనం... తదితర అంశాలు పసిడికి అండగా నిలిచాయి. ఒకానొకదశలో పసిడి ధర శుక్రవారం రాత్రి 1,284.55 డాలర్ల వద్ద తాజాగా ఆరునెలల గరిష్టాన్ని అందుకుంది. చివరకు రాత్రి అమెరికా మార్కెట్లో 2.20 డాలర్ల లాభంతో 1,283.30డాలర్ల వద్ద ముగిసింది. ఈ వారంలో పసిడికి ఇది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఆర్థిక మాంద్య భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టడం, అమెరికా ప్రభుత్వం పాక్షికంగా తన ప్రభుత్వాన్ని షట్‌డౌన్‌ చేయడంతో అమెరికా మార్కెట్లో భారీ ఒడిదుడుకుల నేపథ్యంలో పసిడి ధర 10 వరుస ట్రేడింగ్‌ సెషన్స్‌లో 9 సెషన్లు లాభపడింది. ఈ వారంలో పసిడి ధర 1,260.50 - 1,284.55 డాలర్ల మధ్య కదలాడింది. మొత్తానికి 25 డాలర్లు(2శాతం) పెరిగి వరుసగా రెండోవారమూ లాభంతో ముగిసింది.
1300 డాలర్ల దిశగా పసిడి అడుగులు
ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300 డాలర్ల వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ఆయా దేశాల్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు భౌతిక రూపంలో ఉన్న పసిడి ధరకు డిమాండ్‌ పెంచడటం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత మొదలైన అంశాలు పసిడి ర్యాలికి అండగా నిలుస్తున్నాయి. పసిడి ధర 2019 జనవరిలోనే 1300డాలర్ల స్థాయిని అందుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టెక్సా్‌స్‌ చెందిన కమోడిటి విశ్లేషకుడు వాల్టర్‌ పెహోవిచ్ అభిప్రాయపడ్డారు.
దేశీయం‍గా రూపాయి అడ్డుకట్ట:-
డాలర్‌ మారకంలో రూపాయి బలపడం పసిడి ర్యాలికి అడ్డుకట్ట వేస్తుంది. రాత్రి ఎంసీక్స్‌ మార్కెట్లో 10గ్రాముల డిసెంబర్‌ కాంట్రాక్టు పసిడి ధర రూ.115లు నష్టపోయి రూ.31598.00 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు సైతం వరుసగా మూడోరోజూ లాభపడటం పసిడికి ప్రతికూలాశంగా మారింది.



You may be interested

సిప్లాను కొనవచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 29th December 2018

ఔషధ రంగ దిగ్గజం సిప్లా షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సం‍స్థ కోటక్‌ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచిస్తుంది. ఇటీవల షేరు ధర బాగా పతమనమై, తక్కువ ధర వద్ద ట్రేడ్‌ అవుతోందని, ఈ అంశం షేరు కొనేవారికి మంచి అవకాశమని బ్రోకరేజ్‌ సంస్థ చెబుతుంది.  సిస్లా షేరుపై బ్రోకరేజ్‌ సంస్థ విశ్లేషణలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం షేరు:- సిప్లా రంగం:- ఔషధ రంగం టార్గెట్‌ ధర:- రూ.605లు ఉపోద్ఘాతం:- సిప్లా షేరు ఈ సెప్టెంబర్‌ 18న

పార్లమెంట్‌లో ‘‘బిజినెస్‌’’

Saturday 29th December 2018

ఆర్‌బీఐ పనితీరుపై అసంతృప్తి లేదు: జైట్లీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పనితీరు పట్ల అసంతృప్తి లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. ‘‘ఇటీవలి కాలంలో ఆర్‌బీఐ పర్యవేక్షణ, నియంత్రణ గణనీయంగా మెరుగుపడింది. పటిష్టమయ్యింది’’ అంటూ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇచ్చిన ఒక నివేదికను కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న రూ.9

Most from this category