STOCKS

News


ఇంట్రాడేలో 14నెలల గరిష్టానికి పసిడి

Saturday 8th June 2019
Markets_main1559989694.png-26183

ప్రపంచ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం 14నెలల గరిష్టానికి తాకింది. నిన్న రాత్రి అమెరికా మే నెల ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది. ఈ నెలలో 75,000 కొత్త ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ సంఖ్య మార్కెట్‌ వర్గాల అంచనాల కంటే తక్కువ. గణాంకాలు అంచనాలను అంకోలేకపోవడంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతపై అంచనాలను మరింత పెంచాయి. అలాగే పసిడి ర్యాలీపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్నీ విలువల్లో అరశాతం నష్టపోయి 96.54 స్థాయికి పతనమైంది. ఫలితంగా పసిడి ధర వరుసగా 8రోజూ ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో ఒకదశలో 10డాలర్లు పెరిగి 1,352.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర పసిడికి 14నెలల గరిష్టస్థాయి. అయితే గరిష్టస్థాయిలో పసిడి ఫ్యూచర్లో ట్రేడింగ్‌ జరగడంతో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సమయానికి ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్లు పెరిగి 1,346.10డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ వారంలో పసిడి ధర 41డాలర్లు (3.15శాతం) పెరిగింది. 
దేశీయంగా 3నెలల గరిష్టానికి:- 
దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో శుక్రవారం పసిడి ఫ్యూచర్ల ధర రాత్రి 3నెలల గరిష్టానికి అందుకుంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ర్యాలీ తదితర అంశాలు దేశీయ పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఇంట్రాడేలో  10గ్రాముల పసిడి ధర రూ.33,026ల వద్ద 3నెలల గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సమయానికి గత ముగింపు(రూ.32800)తో పోలిస్తే రూ.136.00 పెరిగి రూ. 32936.00 వద్ద స్థిరపడింది.



You may be interested

ఈ స్టాక్స్‌లో నిఫ్టీకి మించి రాబడులు...!

Sunday 9th June 2019

రానున్న నాలుగు త్రైమాసికాల్లో నిఫ్టీకి మించి అధిక రాబడులు యస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు తదితర స్టాక్స్‌లో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఈక్విటీ99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ తెలిపారు. మార్కెట్ల కదలికలపై స్పందిస్తూ... బీఎస్‌ఈ పీఈ 2018-19లో 24పీఈ వద్ద ఉందని, అది 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 28.3పీఈకి చేరిందన్నారు. ఎన్‌పీఏలకు కేటాయింపులు గరిష్ట స్థాయికి చేరడం, ఆస్తుల నాణ్యత మెరుగుపడడంతో బ్యాంకుల ఎర్నింగ్స్‌ వృద్ధి

క్రెడిట్‌ గ్రోత్‌ అంతంతే!

Saturday 8th June 2019

ఫిచ్‌ రేటింగ్‌ అంచనా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లిక్విడిటీ సమస్య, డిఫాల్ట్‌కు దారితీయడం.. దేశ ఎన్‌బీఎఫ్‌సీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజన్సీ ఫిచ్‌ వ్యాఖ్యానించింది. ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు చేపట్టినా క్రెడిట్‌గ్రోత్‌ అమాంతంగా పెరిగే ఛాన్సులు కనిపించడం లేదని తేల్చిచెప్పింది. ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రమే భారీ లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, బ్యాంకులకు పెద్దగా ఈ సమస్యలేదని తెలిపింది. అయితే బ్యాంకుల్లో ఆస్తుల నాణ్యత, మూలధన బలహీనత అనే సమస్యలున్నాయని తెలిపింది.

Most from this category