STOCKS

News


వారం కనిష్టానికి పసిడి ధర

Thursday 7th February 2019
Markets_main1549520438.png-24061

డాలర్‌ ఇండెక్స్‌ రెండు వారాల గరిష్టానికి ర్యాలీ చేయడంతో పసిడి ధర వారం కనిష్టానికి చేరుకుంది. ఆసియాలో గురువారం ఔన్స్‌ పసిడి 7డాలర్లు నష్టపోయి 1308 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులకు తాము సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనతో రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ భారీగా పుంజుకుంది. నిన్న రాత్రి అమెరికాలో డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు అరశాతం ర్యాలీ 96డాలర్ల స్థాయిని అందుకుంది. నేటి ట్రేడింగ్‌లో సైతం మరో 0.10శాతం లాభడి ప్రస్తుతం డాలర్‌ ఇండెక్స్‌ 96.21 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌కు వ్యతిరేకంగా ట్రేడయ్యే పసిడి ధరలు నేటి ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. 1300డాలర్ల స్థాయి వద్ద పసిడికి బలమైన మద్దతు ధర నెలకొని ఉంది. ప్రపంచ ఆర్థిక మందగమనం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ లాంటి ప్రతికూల అంశాలు పసిడి మద్ధతు ధరను నిలబెడతాయని జేపీ మోర్గాన్‌ సంస్థ అంచనావేస్తుంది.
దేశీయంగా నష్టాల్లోనే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర వారం కనిష్టానికి చేరుకోవడం దేశీయ బులియన్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఎంసీఎక్స్‌లో ఉదయం ట్రేడింగ్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.188లు నష్టపోయి రూ.33139 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

వయసైపోతోంది.. రిస్కు తగ్గుతోంది..

Thursday 7th February 2019

- ఇక కొంతైనా పొదుపు పథకాల్లో పెట్టాలి - స్టార్టప్‌ కంపెనీలతో లాభం లేదు - రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ‍వ్యాఖ్యలు ముంబై: రిస్కులుండే స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులతో కోటీశ్వరుడిగా ఎదిగిన దేశీ ఇన్వెస్ట్‌మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా... క్రమంగా ఈక్విటీల విషయంలో జోరు కాస్త తగ్గించుకోవాలనుకుంటున్నారు. కొంతైనా సురక్షితమైన పొదుపు పథకాల్లో దాచుకోవాలని భావిస్తున్నారు. వయస్సు మీద పడుతుండటంతో రిస్కులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేస్తున్నట్లు స్టార్టప్స్ సదస్సు టైకాన్‌లో పాల్గొన్న సందర్భంగా

ఆర్‌బీఐ పాలసీ...రెపో రేటు పావుశాతం కట్‌

Thursday 7th February 2019

రిజర్వుబ్యాంక్‌...మార్కెట్‌ అంచనాలకు భిన్నంగా రెపో రేటును పావుశాతం తగ్గించింది. మూడురోజుల సమీక్షా సమావేశం అనంతరం గురువారం మధ్యాహ్నం ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ రెపో రేటును 6.25 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. 

Most from this category