STOCKS

News


డాలర్‌ ఎఫెక్ట్‌ - స్వల్పంగా తగ్గిన పసిడి

Thursday 25th April 2019
Markets_main1556167747.png-25343

డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు నష్టపోయి 1,277.25డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌, జర్మనీ విడుదల చేసిన బలహీన ఆర్థిక గణాంకాలు పసిడి ధర మరింత నష్టపోకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి. అమెరికారిలో గృహ కొనుగోళ్ల గణాంకాలు ఆశించినస్థాయిలో నమోదుకావడం డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీకి కారణమైంది. రాత్రి అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపు నేపథ్యంలో అక్కడ 6డాలర్ల మేర ర్యాలీ చేసి 1,279.50 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా స్వల్ప నష్టం:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా నష్టపోయింది. ఉదయం ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.85.00లు నష్టపోయి రూ.31733.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 24పైసలు నష్టపోయిన నేపథ్యంలో పసిడి ధర రూ.31, 858ల వద్ద ముగిసింది.



You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త రికార్డు

Thursday 25th April 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లు గురువారం కొత్త జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.1392.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఒకానొక దశలో 1.50శాతం ర్యాలీ చేసి రూ.రూ.1411.50ల వద్ద స్థాయికి చేరుకున్నాయి. ఈ ధర షేర్ల కొత్త జీవితకాల గరిష్ట ధర కావడం విశేషం. ఉదయం 11:20ని.లకు షేరు బీఎస్‌ఈలో గత ముగింపు ధర(రూ.1390)తో

లాభాల ప్రారంభం- వెంటనే నష్టాల్లోకి...

Thursday 25th April 2019

ప్రపంచమార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 48 పాయింట్ల లాభంతో 39,101.78 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 11,735.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే నేడు ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ ప్యూచర్‌ కాంట్రాక్టు ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో పాటు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 15 పైసలు బలహీనపడి 70.01 స్థాయి వద్ద ప్రారంభం కావడం

Most from this category