STOCKS

News


1300డాలర్ల దిగువకు పసిడి

Saturday 2nd March 2019
Markets_main1551523913.png-24407

డాలర్‌ ఇండెక్స్‌ 10వారాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300 డాలర్ల దిగువకు పతనమైంది. అమెరికా మార్కెట్‌లో శుక్రవారం ఔన్స్‌ పసిడి 17 డాలర్లు నష్టపోయి 1,299 వద్ద స్థిరపడింది. పసిడికి ఇది నెలన్నర కనిష్టస్థాయి. ఈ వారంలో అమెరికా విడుదల చేసిన ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ.., డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో 10వారాల గరిష్టానికి చేరుకుంది. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు తుదిదశకు చేరుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్‌ బలపడుతుందనే మార్కెట్‌ వర్గాల అంచనా కూడా పసిడి ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా రాత్రి అమెరికాలో పసిడి 15 డాలర్లు నష్టపోయి(2 శాతం) 1,291 డాలర్ల కనిష్టానికి చేరుకుంది. ఈ వారంలో పసిడి మొత్తం 33.60డాలర్లు((2.50శాతం) నష్టపోయింది. పసిడి ధర 1350-60 స్థాయిని చేరిన ప్రతిసారి వెనకడుగు వేస్తుంది. ఈ కీలక స్థాయిని చేరుకున్న పిమ్మట లాభాల స్వీకరణ, సాంకేతిక అంశాలతో పసిడి ధర డౌన్‌ ట్రెండ్‌ బాట పట్టిన 1285 డాలర్ల వద్ద మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంటుంది. 2013 నుంచి ఇలా జరగడం 5వసారి. 
దేశీయంగా భారీ పతనం:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 17డాలర్లు నష్టపోవడంతో దేశీయ మార్కెట్లోనూ పసిడి ధర భారీ నష్టాలతో ముగిసింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.341(1 శాతం)లు నష్టపోయి రూ.32640.00 వద్ద ముగిసింది. ఈ వారం మొత్తంమీద ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.855లు నష్టపోయింది.



You may be interested

దీర్ఘకాలం కోసం ఈ పీఎస్‌యూ కంపెనీలు!

Monday 4th March 2019

ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులకు ఢోకా ఉండదన్న విషయం చాలా మంది ఇన్వెస్టర్లకు తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వరంగంలోని మహారత్న, నవరత్న కంపెనీలకు ప్రభుత్వపరంగా మద్దతు, సహకారం ఎప్పుడూ ఉంటుంది. మంచి పనితీరుతో కూడిన పీఎస్‌యూ కంపెనీల్లో దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు పరిశీలించతగిన స్టాక్స్‌ను పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆ వివరాలే ఇవి...   ‘‘ఇటీవలి దిద్దుబాటు నేపథ్యంలో ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న పీఎస్‌యూ స్టాక్స్‌లో ఎంతో విలువ నెలకొని ఉంది. డివిడెండ్‌

అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు

Saturday 2nd March 2019

అమెరికా ఫిబ్రవరి ఆర్థిక గణాంకాల నిరుత్సాహపరిచినప్పటికీ.., చైనాతో వాణిజ్య వివాద పరిష్కార చర్చలపై ఆశలతో శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డోజోన్స్‌ 110 పాయింట్లు(0.43 శాతం) లాభపడి 26,026 వద్ద, ఎస్‌అండ్‌పీ 19 పాయింట్లు పెరిగి 2,804 వద్ద, నాస్‌డాక్ 63 పాయింట్లు(0.83 శాతం) బలపడి 7,595 వద్ద స్థిరపడ్డాయి. ఈ మార్చి 1వ తేదితో చైనాతో ముగిసిన వాణిజ్య చర్చలు అనంతరం అమెరికా అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ

Most from this category