STOCKS

News


1200 డాలర్ల వద్ద పసిడి ధర

Thursday 4th October 2018
Markets_main1538632183.png-20848

డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ కారణంగా గురువారం పసిడి ధర 1200డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:45లకు ఔన్స్‌ పసిడి 2.20 డాలర్లు నష్టంతో 1,200.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం రోజు వారం రోజుల గరిష్టం వద్ద ( 1209.40 డాలర్లు) ట్రేడైన పసిడి ధరలు ఈ స్థాయిలో పతనమవడానికి డాలర్‌ ఇండెక్స్‌ కారణమైంది. బుధవారం రాత్రి అమెరికా మెరుగైన ఆర్థిక గణాంకాలను ప్రకటించింది. డాలర్‌ ఇండెక్స్‌ రాత్రి ఆరు వారాల గరిష్ట స్థాయి (96.116)ని తాకింది. పదేళ్ల ట్రెజరీ ఈల్డ్‌ ఏడేళ్ల గరిష్ట స్థాయి 3.179 చేరుకుంది. ఫలితంగా బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 10డాలర్ల వరకు పతనమైంది. మార్కెట్‌ ముగిసే సమయానికి 1,202.90 వద్ద స్థిరపడింది.
దేశీయం స్వల్ప పెరుగుదల:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికి.., దేశీయంగా స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి కొత్త జీవితకాల కనిష్టానికి చేరుకోవడం ఇందుకు కారణమైంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయంగం.10:30ని.లకు 10గ్రాముల పసిడి రూ.25.00లు లాభపడి రూ.31034.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

యస్‌ బ్యాంక్‌కు ‘బై’ రేటింగ్‌..

Thursday 4th October 2018

బ్రోకరేజ్‌ సంస్థలు యస్‌ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాయి. కొత్త బాస్‌ ఎంపికపైనే ప్రధానంగా దృష్టి కేంద్రకరించినట్లు యస్‌ బ్యాంక్‌ పేర్కొనిందని, అలాగే రుణ నాణ్యత స్థిరంగా ఉందని పునరుద్ఘాటించిందని బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కొన్నాయి.  డాయిష్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఇన్వెస్టెక్‌, మెక్వైరీ, మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థలన్నీ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి. రూ.310-రూ.430 శ్రేణిలో టార్గెట్‌ ధరలను నిర్ణయించాయి.  బ్యాంక్‌ వెల్లడించిన చర్యల వల్ల

ఈ షేర్లతోనే సూచీల పతనం

Thursday 4th October 2018

నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్న ముడి చమురుధర, జీవితకాల కనిష్టానికి పతనమైన రూపాయి ధర...  కలిసి గురువారం మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 600పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ సూచీ 200 పాయింట్లను నష్టపోయింది. హెవీవెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల నష్టాల ట్రేడింగ్‌ సూచీల క్షీణతకు ప్రధాన కారణమయ్యాయి. నిఫ్టీ కోల్పోయిన 200 పాయింట్లలో ...... 1.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(5శాతం నష్టం)- 42.11పాయింట్లు 2.టీసీఎస్‌ (3.50శాతం నష్టం)-

Most from this category