STOCKS

News


2-3 నెలల్లో 31,000కి పసిడి!!

Monday 5th November 2018
Markets_main1541401763.png-21716

ధంతేరాస్‌ పవిత్రమైన రోజని, అప్పుడు పసిడి కొనుగోలు చేస్తే శ్రేయస్కరమని చాలా మంది విశ్వసిస్తారు. సాంప్రదాయ ఇన్వెస్టర్లు ధంతేరాస్‌ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మొత్తంలో పసిడిని కొనుగోలు చేయవచ్చని, అయితే పోర్ట్‌ఫోలియోలో బంగానికి తగిన కేటాయింపుల కోసం సరైన సమయం కోసం వేచిచూడటం మంచిదని రిలయన్స్‌ కమోడిటీస్‌ హెడ్‌ (కమోడిటీ) ప్రీతమ్‌ పట్నాయక్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని గమనిస్తే.. దేశీయంగా, అంతర్జాతీయంగా పుత్తడి ధరలకు పొంతన లేకుండా పోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం, డాలర్‌ బలపడటం కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు క్షీణించాయి. డాలర్‌ ప్రాతిపదికన చూస్తే 2018 జనవరి నుంచి బంగారం ధరలు దాదాపు 15 శాతం తగ్గాయి. అయితే ఇదే సమయంలో దేశీయంగా ఎంసీఎక్స్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ధర 15 శాతంమేర పెరిగింది. బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటంతో.. రూపాయి క్షీణత కారణంగా రూపాయి పరంగా బంగారం ధరలు పెరిగాయి. 
ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల నిర్ణయం, డాలర్‌ బలపడటం, వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు అంతర్జాతీయంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంచితే.. అమెరికా డాలర్‌ మరింత బలపడితే.. అప్పుడు రూపాయి మరింత క్షీణించి దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయి. అలాగే వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే.. అప్పుడు బంగారం సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా మారుతుంది. అప్పుడు గ్లోబల్‌గా, దేశీయంగా ధరలు పెరుగుతాయి. అలాగే మరోవైపు చూస్తే.. ఇండియా, చైనా వంటి వర్ధమాన దేశాల్లో బంగారం వినియోగం ఎక్కువగా ఉంది. ఆయా దేశాల కరెన్సీలు బలహీనపడితే అప్పుడు బంగారం డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. కరెన్సీ క్షీణత వల్ల దిగుమతులు ఖరీదవుతాయి. అప్పుడు కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని ఎంచుకుంటారు. అధిక ధరల నేపథ్యంలో పండుగ సీజన్‌ ఉన్నా కూడా డిమాండ్‌ నెమ్మదిస్తుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ పేర్కొంది. భారత్‌లో ప్రస్తుత ఏడాది ఇప్పటి దాకా బంగారం డిమాండ్‌ 6.5 శాతంమేర తగ్గిందని తెలిపింది. పండుగ సీజన్‌ నేపథ్యంలో డిమాండ్‌ నెమ్మదించడం వల్ల జువెలర్లు డిస్కౌంట్ల రూపంలో కస్టమర్లను ఆకర్షించొచ్చు. వచ్చే 2-3 నెలల కాలంలో బంగారం ఫ్యూచర్స్‌ ధర రూ.31,000లకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నాం. You may be interested

సంవత్ 2075లో సెన్సెక్స్‌ శ్రేణి 35,000-45,000 పాయింట్లు

Monday 5th November 2018

50 శాతం మార్కెట్‌ విశ్లేషకుల అంచనా ఇదే ముంబై: సంవత్ 2075లో సెన్సెక్స్‌ 45,000 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. పలు ప్రాంతాలలో నూతన ఏడాది ప్రారంభంగా భావించే దీపావళి పండుగ దగ్గర పడిన సందర్భంగా.. ఇక్కడ నుంచి వచ్చే ఏడాది పాటు మార్కెట్‌ ఎలా ఉండవచ్చనే అంశంపై ఒక ఆంగ్ల చానల్‌ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు అంచనాలు వెల్లడయ్యాయి. పోల్‌లోని 50 శాతం మార్కెట్‌ విశ్లేషకులు

తగ్గిన సన్‌ టీవీ వెలుగులు

Monday 5th November 2018

ఆశాజనక రెండో త్రైమాసిక ఫలితాలు సన్‌ టీవీ షేర్లకు వెలుగునివ్వలేకపోయాయి. సన్‌టీవి ఈ క్యూ2లో ఆశించిన స్థాయిలో ఫలితాలను ఆర్జించినప్పటికీ.., ఈ కంపెనీ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 7శాతం నష్టపోయాయి. నేడు సన్‌టీవి షేర్లు బీఎస్‌ఈలో రూ.663.4ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడతో షేరు 7శాతం క్షీణించి రూ.615.85లకు పతనమైంది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.663.4)తో పోలిస్తే 6.50శాతం నష్టపోయి రూ.619ల వద్ద

Most from this category