STOCKS

News


పసిడికి లాభాల వెలుగులు

Saturday 9th March 2019
Markets_main1552127699.png-24518

అంతర్జాతీయ ఆర్థికవృద్ధి మందగమన ఆందోళనలతో అ‍గ్రరాజ్యాల ఫిబ్రవరి ఆర్థిక గణాంకాలు నిరుత్సాహపరిచిన నేపథ్యంలో పసిడి ధర వెలుగులు విరుజిమ్మింది. గత రాత్రి అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ పసిడి ధర 13డాలర్ల మేర లాభపడి 1,299.30 డాలర్ల వద్ద స్థిరపడింది. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నెమ్మదించిన ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు వడ్డీరేట్ల పెంపును వాయిదా వేయడంతో పాటు తక్కువ వడ్డీలకు రుణాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరిలో చైనా ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఇదే నెలలో అమెరికాలో 1.80లక్షల మందికి ఉపాధి కల్పన జరగవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేయగా, కేవలం 20వేల ఉద్యోగాల సృష్టి మాత్రమే జరిగింది. ఉపాధి కల్పన తగ్గిపోవడంతో ట్రెజరీ ఈల్డ్‌ రెండు నెలల గరిష్టానికి చేరుకోవడంతో డాలర్‌ ఇండెక్స్‌ ఏడు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌లో 15డాలర్లు లాభపడి 1300 డాలర్ల నిరోధ స్థాయిని అధిగమించి 1,301.30 డాలర్ల గరిష్టస్థాయికి అందుకుంది. చివరికి అమెరికా మార్కెట్లో 13డాలర్ల లాభంతో 1,299.30 వద్ద ముగిసింది. 
-    ఇక వారం చూసినట్లైతే ఈ వారంలో పసిడి ఎలాంటి లాభ, నష్టం లేకుండా గతవారం ముగింపు ధర 1,299 వద్దే స్థిరపడింది. 
-    ఈ వారంలో 1280.80డాలర్ల కనిష్టాన్ని, 1,301.30డాలర్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. 
దేశీయంగానూ అదే జోరు:-

ప్రపంచమార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర జోరు సాగింది. డాలర్‌ మారకంలో రూపాయి దూకుడుకు బ్రేక్‌ పడటం పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. శుక్రవారం రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.233.00లు లాభపడి రూ.32167.00 వద్ద స్థిరపడింది. 
- శుక్రవారం పసిడి ధర రూ.233 లాభపడినప్పటికీ.., ఈ వారం మొత్తం చూస్తే ఈ వారంలో పసిడి ఏకంగా రూ.490లు నష్టపోయింది. ఈ వారంలో రూపాయి ర్యాలీకి పసిడి ప్రతికూలంగా మారింది.



You may be interested

ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ @40,000!

Saturday 9th March 2019

బీఎన్‌పీ పారిబా అంచనా ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే ఇండియా మార్కెట్లు ఈ ఏడాది కాస్త తక్కువ జోరే చూపాయి. కానీ ఏడాది చివరకల్లా దేశీ మార్కెట్లు స్పీడందుకుంటాయని, డిసెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 40వేల పాయింట్లను చేరుతుందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ బీఎన్‌పీ పారిబా అంచనా వేస్తోంది. ఈ ఏడాది తొలి అర్ధభాగం మార్కెట్లకు కొంత క్లిష్టంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ఎన్నికల హడావుడి, చమురు ధరల పెరుగుదల, ఎర్నింగ్స్‌ డౌన్‌గ్రేడ్స్‌లాంటివి మార్కెట్లపై

పాజిటివ్‌గా మారుతున్న ఈక్విటీలు

Saturday 9th March 2019

సాంక్టమ్‌వెల్త్‌ అంచనాలు గత ఎన్నికల సమయంలో దాదాపు ఆరేడు నెలలపాటు ఎన్నికలకు ముందు నిఫ్టీ హోల్డింగ్‌ పాటర్న్‌ను కొనసాగించింది. ప్రస్తుతం సూచీలు మరలా ఇదే పాటర్న్‌ చూపుతున్నాయి. 2014 ఫిబ్రవరి అనంతరం ఎన్నికలపై ఒక స్పష్టత రావడంతో సూచీలు పరుగు ఆరంభించాయి. అయితే అప్పటికి ఇప్పటికి వాల్యూషన్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎకానమీ అప్పటికన్నా బలంగా తయారైంది, డిమాండ్‌లో జోరు పెరిగింది, ద్రవ్యోల్బణం దిగిచ్చింది. సైక్లిక్‌ ధృక్పథం అనుసరించి

Most from this category