STOCKS

News


1300డాలర్లపైన ముగింపు

Saturday 16th March 2019
Markets_main1552734814.png-24648

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 1300 డాలర్ల పైన ముగిసింది. చైనా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోతుందని ఆర్థికవేత్తలు అంచనాలతో పాటు, అమెరికా ఉద్యోగ గణాంకాలు, తయారీ రంగ గణాంకాలు మార్కెట్‌ వర్గాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడం పసిడి ర్యాలీకి కలిసొచ్చాయి. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి ఔన్స్‌ పసిడి ధర 7.15డాలర్లు పెరిగి 1,302.25డాలర్ల వద్ద ముగిసింది. న్యూజిలాండ్‌ మసీదులో అగంతకుడి కాల్పులతో 40 మంది మరణించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముందస్తు రక్షణాత్మక చర్యల్లో భాగంగా పసిడి ఫ్యూచర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ పతనంకు కూడా పసిడి ర్యాలీకి తోడ్పాటును అందించింది. 
-    గతవారంలో పసిడి ధర 1300 డాలర్ల దిగువను 1,299.30 వద్ద ముగిసింది. 
-    వారం మొత్తంగా చూస్తే పసిడి 4డాలర్లు మాత్రమే లాభపడింది.
-    ఈ వారంలో 1,290.60 - 1,311.60 రేంజ్‌లో కదలాడింది.​

దేశీయంగా స్వల్ప లాభమే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి భారీగా లాభపడినప్పటికీ.., దేశీయ మార్కెట్లో మాత్రం స్వల్పంగా లాభపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం పసిడికి అవరోధంగా మారింది. శుక్రవారం 24పైసలు లాభపడటంతో ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి రూ.18లు లాభపడి రూ. 31826.00ల వద్ద స్ధిరపడింది.
- వారంలో డాలర్‌ మారకంలో రూపాయి భారీ బలపడటం(104 పైసలు)తో పసిడి ధర రూ.791లు నష్టపోయింది. 



You may be interested

మార్కెట్‌ వేడెక్కి ఉంది.. జాగ్రత్త!

Saturday 16th March 2019

కన్సాలిడేషన్‌ వరకు వేచి ఉండడం మంచిది నిపుణుల సూచన నెలారంభం నుంచి విరామం లేకుండా దేశీ సూచీలు ర్యాలీ జరుపుతున్నాయి. దీంతో అన్ని చార్టుల్లో ఇండికేటర్లు ఓవర్‌బాట్‌ స్థితిని చూపుతున్నాయని, మార్కెట్లో కాస్త వెసులుబాటు కనిపించేవరకు అతి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌ పరుగు చూసి ఆశతో ముందుకు పోకుండా, ఆచితూచి వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ వారంలో మార్కెట్‌ చిన్నపాటి వెనుకంజ వేయడం తప్పనిసరని అంచనా వేస్తున్నారు. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ

ఇంకొక్కసారి పెంచిన తర్వాత విరామం!?

Saturday 16th March 2019

ఫెడ్‌ వడ్డీరేట్ల పాలసీపై నిపుణుల అంచనా గతంలో చెప్పినట్లు ఒక్కనెల కాకుండా మరికొంత కాలం ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచకపోవచ్చని, మూడో త్రైమాసికం వరకు వేచిచూడవచ్చని పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యు3లో ఒకసారి రేట్లు పెంచినతర్వాత మరలా వేచిచూసే ధోరణిని అవలంబిస్తుందని రాయిటర్స్‌ పోల్‌లో పలువురు భావించారు. దాదాపు 100 మంది అనలిస్టులు ఈ పోల్‌లో పాల్గొన్నారు. ఫెడ్‌ చైర్మన్‌ సైతం రేట్ల పెంపునకు తాము ఎలాంటి తొందరపడడం లేదని

Most from this category