STOCKS

News


5నెలల గరిష్టానికి పసిడి ధర

Saturday 8th December 2018
Markets_main1544267294.png-22775

ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల పెంపుపై అనుమానాలు రేకెత్తడంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం 5నెలల గరిష్టానికి చేరుకుంది. రాత్రి అమెరికా విడుదల చేసిన నవంబర్‌ నిరుద్యోగ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈ నెలలో 195,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆర్ధికవేత్తలు అంచనావేయగా, కేవలం 155,000 ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగినట్లు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ గణాంకాలను విడుదల చేసింది. వ్యవస్థలో ఉపాధి కల్పన మందిగించడంతో ఈ డిసెంబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై మార్కెట్‌ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అనుమానాలు డాలర్‌పై ప్రభావాన్ని చూపడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 96.71 స్థాయికి చేరుకుంది. పసిడి ధరపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ పతనంతో రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు భారీ డిమాండ్‌ పెరిగింది. ఇంట్రాడేలో ఒకనొక దశలో ఔన్స్‌ పసిడి ధర 12.20 డాలర్ల ర్యాలీ చేసి 1,255.80 డాలర్ల స్థాయిని తాకింది. ఈ ధర పసిడికి 5నెలల గరిష్టస్థాయి. పసిడి ధరకు జూలై 04 తరువాత 1,255.80 గరిష్టస్థాయిని అందుకోగలిగింది. చివరకు గత ముగింపు ధర(1243.60 డాలర్లు)తో పోలిస్తే 10.45 డాలర్లు లాభపడి 1245.05డాలర్ల వద్ద ముగిసింది. ఇక వారం పరంగా చూస్తే పసిడి ధర ఈ వారంలో మొత్తం 26.60 డాలర్లు(2.16 శాతం) లాభపడింది. ఇదేవారంలో1,226.60 - 1255.80డాలర్ల స్థాయిలో కదలాడి ట్రేడింగ్‌ చివరి రోజైన శుక్రవారం 1245.05 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగా రూ.500లు అప్‌:-
దేశీయ మార్కెట్లో సైతం శుక్రవారం పసిడి ధర ర్యాలీ చేసింది. ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.500లకు పైగా లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ర్యాలీ చేయడం, డాలర్‌ మారకంలో రూపాయి బలపడంతో తదితర కారణాలు దేశీయంగా పసిడి బలపడటానికి కారణమయ్యాయి. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాములు పసిడి ధర రూ.506.00లు లాభపడి రూ.31595.00ల వద్ద స్థిరపడింది. పసిడి ధర ఐదు వారాల నష్టాల ముగింపునకు ఈ వారం ముగింపు పడింది.



You may be interested

70 డాలర్లను దాటదు!

Saturday 8th December 2018

క్రూడాయిల్‌ ధరపై వందనా హరి అంచనా ఒకపక్క ట్రంప్‌ ట్వీట్లను పట్టించుకున్నామని చెబుతూనే సౌదీ అరేబియా ఉన్నట్లుండి చమురు ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోమారు క్రూడాయిల్‌ ధరల ర్యాలీ ఉండొచ్చన్న భయాలు పెరిగాయి. కానీ ఇవన్నీ నిరర్ధకాలేనని, క్రూడాయిల్‌ ధర 70- 75 డాలర్లను దాటకపోవచ్చని ప్రముఖ విశ్లేషకురాలు వందనా హరి అంచనా వేస్తున్నారు. సౌదీ ప్రకటన వెనుక చాలా కసరత్తు జరిగిందని, ట్రంప్‌కు కోపం రాకుండా ఉండేందుకు

అంబానీలు ఏం చేసినా ప్రత్యేకమే!!

Saturday 8th December 2018

5,000పైగా మందికి అన్నదాన కార్యక్రమం ఇతరుల సంతోషాన్ని కోరుకుంటే.. దేవుడు మనకు కూడా మంచే చేస్తాడని ఎక్కువ మంది విశ్వసిస్తుంటారు. దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ కూడా ఇలాగే అనుకున్నట్లున్నారు. అందుకేనేమో.. తన గారాలాపట్టీ ఇషా ముందస్తు పెళ్లి వేడుకులను అన్నదాన కార్యక్రమంతో ఎంతో ఘనంగా ఆరంభించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంబానీ కుటుంబ సభ్యులు శుక్రవారం రోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 5,100 మందికి కడుపు నిండా అన్నం పెట్టారు.

Most from this category