STOCKS

News


62 డాలర్లకు పతనమైన బ్రెంట్‌ క్రూడ్‌

Wednesday 21st November 2018
Markets_main1542776170.png-22251

  • 4.43 డాలర్ల క్షీణత
  • డిసెంబర్‌ 2017 స్థాయికి పతనం

ముడిచమురు ధరలు ఏడాది కనిష్టస్థాయికి పతనమయ్యాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌) తీసుకుంటున్న నిర్ణయాలు ఫలించవనే అంచనాల నేపథ్యంలో యూఎస్‌ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ బ్యారెల్ ధర 3.77 శాతం పతనమై 53.43 డాలర్లకు తగ్గింది. జనవరి 19తో ముగిసే ఫ్యూచర్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 52.77 కనిష్టానికి పతనమైంది. ఇది అక్టోబర్‌ 2017 నాటి ధర కాగా, గతేడాదిలో నమోదైన నాలుగేళ్ల గరిష్టస్థాయి నుంచి చూస్తే మంగళవారం నాటికి 31 శాతం పడిపోయింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ఫ్యూచర్‌ 4.43 డాలర్లు (6.6 శాతం) పతనమై 61.71 డాలర్లకు పడిపోయింది. డిసెంబర్‌ 2017 స్థాయికి క్షీణించింది. గతనెల గరిష్టస్థాయి నుంచి 29 శాతం పతనమైంది. అమెరికా కంపెనీల ఎర్నింగ్స్‌ తగ్గుతాయనే అంచనాలకు తోడు ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగిస్తుందనే అంచనాలు తాజా భారీ పతనానికి ప్రధాన కారణంగా నిలిచినట్లు క్లిప్పర్‌డేటా కమోడిటీ రీసెర్చ్‌ డైరెక్టర్‌ మాట్‌ స్మిత్‌ విశ్లేషించారు. ఇక భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయానికి బ్రెంట్‌ 63.52 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ 54.33 వద్ద కొనసాగుతోంది.

భారత్‌లోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే క్రూడ్‌ కాంట్రక్ట్‌ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. డిసెంబర్‌ 18తో ముగిసే కాంట్రాక్ట్‌ ఉదయం 10 గంటల సమయానికి రూ.34 (0.88 శాతం) లాభపడి రూ.3,888 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ రేసులో ఐదు కంపెనీలు

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: భారీ రుణ భారంతో దివాల ప్రక్రియను ఎదుర్కొంటున్న జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను టేకోవర్‌ చేయడానికి ఐదు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఎన్‌బీసీసీ, కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేస్‌, సురక్ష గ్రూప్‌లు ఈ టేకోవర్‌ రేస్‌లో ఉన్నాయి.  తాజా బిడ్‌లు.. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను టేకోవర్‌ చేయడానికి రూ.7,000 కోట్లతో సురక్ష గ్రూప్‌ గతంలోనే బిడ్‌ను సమర్పించింది. ఈ బిడ్‌ను జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ రుణదాతలు తిరస్కరించారు.

రెండవ త్రైమాసికంలో జీడీపీ డౌన్‌?

Wednesday 21st November 2018

ముంబై: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) తగ్గే అవకాశం ఉందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రేటు దాదాపు 7.2 శాతంగా నమోదయ్యే వీలుందని తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల మందగమనం దీనికి కారణమని పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 8.2 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరున సెప్టెంబర్‌

Most from this category