STOCKS

News


పసిడి కొనుగోళ్లకు తగిన సమయం!

Saturday 22nd September 2018
Markets_main1537592364.png-20462

ముంబై: ప్రస్తుత పరిస్థితులు పసిడి కొనుగోళ్లకు సరైన సమయంగానే కనిపిస్తోంది. విశ్లేషణలోకి వెళితే... పసిడికి పలు దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్‌ పటిష్టంగా ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక ఒకటి తాజాగా పేర్కొంది. ఈ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికను చూస్తే...
♦ తమ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా పెంచుకోవడంపై కేంద్ర బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. 
♦  2018 మొదటి ఆరు నెలల కాలంలో సెంట్రల్‌ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం పసిడికి 193.3 టన్నుల బంగారం అదనంగా చేరింది. 2017 ఇదే కాలంతో పోల్చిచూస్తే (178.6 టన్నులు) ఇది 8 శాతం అధికం. 
♦  ఇప్పటికే పలు సెంట్రల్‌ బ్యాంకుల విదేశీ మారకపు నిల్వల్లో అమెరికా డాలర్లు భారీగా ఉన్నాయి. వీటికి పసిడితో కొంత రక్షణ కల్పించాలని కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి.  రష్యా, టర్కీ, కజికిస్తాన్‌ వంటి దేశాల సెంట్రల్‌ బ్యాంకుల ఇటీవలి చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 
♦ ఆర్థిక సంక్షోభ సమయంలో విదేశీ మారకపు నిల్వలను పెంచుకోవడంపై పలు సెంట్రల్‌బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. ఇందులో ఎక్కువశాతం పసిడి రూపంలో ఉండాలనే విషయంపై దృష్టి పెట్టాయి. 
♦  2015 తర్వాత ఈ స్థాయిలో పసిడికి కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్‌ రావడం ఇదే తొలిసారి. 
♦  ఈజిప్టు 1978 తరువాత మొట్టమొదటిసారి ఇటీవలే పసిడిని కొనుగోలు చేసింది. ఇండియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పైన్స్‌ కూడా పలు సంవత్సరాల తర్వాత మళ్లీ పసిడి మార్కెట్‌లోకి పునఃప్రవేశిస్తున్నాయి. 

తొమ్మిదేళ్ల తర్వాత బంగారాన్ని కొన్న ఆర్‌బీఐ...
రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. తొమ్మిదేళ్లలో ఆర్‌బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటి సారి. 2018 జూన్‌ 30 నాటికి  ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 566.23 టన్నులకు చేరాయి. 2017 జూన్‌ నాటికి ఉన్న నిల్వలు 557.77 టన్నులు మాత్రమే. చివరి సారిగా 2009లో ఆర్‌బీఐ 200 టన్నుల బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి కొనుగోలు చేసింది. డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం వల్లే గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం నిల్వలు పెంచుకునేందుకు దారితీసినట్టు ఆర్‌బీఐ నివేదిక తెలియజేస్తోంది. 

ఆర్‌బీఐ వద్ద 566 టన్నులు...
కాగా తాజా గణాంకాల ప్రకారం భారత్‌ విదేశీ మారకపు నిల్వల్లో దాదాపు 20.23 బిలియన్‌ డాలర్ల పసిడి నిల్వలు ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. తొమ్మిదేళ్లలో ఆర్‌బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటి సారి. 2018 జూన్‌ 30 నాటికి (ఆర్‌బీఐ అకౌంటింగ్‌ సంవత్సరం జూలై నుంచి జూన్‌ వరకు) ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 566.23 టన్నులకు చేరాయి. 2017 జూన్‌ నాటికి ఉన్న నిల్వలు 557.77 టన్నులు మాత్రమే. చివరి సారిగా 2009లో ఆర్‌బీఐ 200 టన్నుల బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి కొనుగోలు చేసింది. డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం వల్లే గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం నిల్వలు పెంచుకునేందుకు  ఆర్‌బీఐ మొగ్గుచూపింది. 

1,200 డాలర్లు పటిష్టస్థాయి....
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- నైమెక్స్‌లో పసిడి  ఔన్స్‌ (31.1గ్రా) ధర గడిచిన నెల రోజులుగా 1,200 డాలర్ల వద్ద కదలాడుతోంది. పసిడికి ప్రస్తుత ధర అంతర్జాతీయంగా పటిష్ట మద్దతు స్థాయని అభిప్రాయం. రూపాయి బలహీనతల వల్ల ఇక భారత్‌లోనూ భారీగా తగ్గే అవకాశాలు ఏవీ కనిపించడం లేదు.  విశ్లేషకుల అంచనాల ప్రకారం- 1,200 డాలర్ల  ధర పసిడి ఉత్పత్తిదారులకు కొంత లాభదాయకమైనదే. అయితే ఈ స్థాయికన్నా కిందకు పడితే, ఉత్పత్తి... అందుకు అనుగుణంగా సరఫరాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే పసిడికి డిమాండ్‌ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత శ్రేణిలో మరో ఐదారు నెలలు 40 డాలర్ల అటు- ఇటుగా పసిడి కదలికలు జరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. టెక్నికల్‌గా చూసినా, ఫండమెంటల్‌గా చూసినా, నిర్వహణా పరంగా అలోచించినా పసిడి ప్రస్తుతం ‘‘స్వీట్‌ స్టాప్‌’’అన్నది వాదన. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో చైనా పెట్టుబడిదారులు ఇటీవలి కాలంలో 68 డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి కావడం ఇక్కడ గమనార్హం. ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ను చూస్తే, 89కి పడిన తర్వాత మళ్లీ 96ను చూసిన ఇండెక్స్‌ మళ్లీ ఆస్థాయిలో నిలదొక్కుకోలేక ప్రస్తుతం 93ను చూస్తుండడం ఇక్కడ గమనార్హం. You may be interested

మరో 55వేల డొల్ల కంపెనీలు రద్దు..

Saturday 22nd September 2018

ముంబై: మనీలాండరింగ్‌ని అరికట్టే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా రెండో దశలో 55,000 పైచిలుకు డొల్ల కంపెనీలను మూయించినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి. చౌదరి తెలిపారు. మరికొన్ని కంపెనీల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్నింటికి నోటీసులు కూడా పంపినట్లు ఇండో-‍అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నాలుగో వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రెండేళ్ల పైగా వార్షిక ఆర్థిక నివేదికలు దాఖలు చేయని

మరిన్ని ప్రాంతాలకు థైరోకేర్‌

Saturday 22nd September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డయాగ్నోస్టిక్‌ ల్యాబ్స్‌ చైన్‌ థైరోకేర్‌ టెక్నాలజీస్‌ చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 8 ల్యాబ్‌లు ఉన్నాయి. 2020 నాటికి వీటి సంఖ్య 60కి చేరుకుంటుందని థైరోకేర్‌ ఫౌండర్‌ డాక్టర్‌ వేలుమణి శుక్రవారమిక్కడ తెలిపారు. విజయవాడ, వైజాగ్‌లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్కో కేంద్రానికి కంపెనీ రూ.4 కోట్లు ఖర్చు చేస్తోంది. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కీలకోపన్యాసం

Most from this category