STOCKS

News


తగ్గిన నిల్వలు..పెరిగిన చమురు

Wednesday 21st August 2019
Markets_main1566360730.png-27903

యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా తగ్గడంతో చమురు ధర బుధవారం ట్రేడింగ్‌లో 60 డాలర్ల పైకి చేరుకుంది. కానీ అంతర్జాతీయ మందగమన భయాలు చమురు లాభాలను తగ్గిస్తుండడం గమనార్హం. బ్రెంట్‌ క్రూడ్‌ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 60.16 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీఐ క్రూడ్‌ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 56.25 డాలర్లకు చేరుకుంది. కాగా బ్రెంట్‌ క్రూడ్‌ గత సెషన్‌లో 0.5 శాతం లాభపడి ముగిసిన విషయం తెలిసిందే. 
   అగష్టు 16తో ముగిసిన వారంలో యుఎస్‌ ముడి చమురు నిల్వలు 35 లక్షల బ్యారెల్‌లు తగ్గి 4,398 లక్షల బ్యారెల్స్‌కు చేరుకుందని అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టీట్యూట్‌(ఏపీఐ) మంగళవారం తెలిపింది. కాగా ఈ తగ్గుదల 19 లక్షల బ్యారెల్స్‌గా ఉంటుందని రాయిటర్స్‌ విశ్లేషకులు అంచనావేయడం గమనార్హం. యుఎస్‌ ముడి చమురు నిల్వల డేటాను ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఈఐఏ) బుధవారం విడుదల చేయనుంది. దీనితోపాటు యుఎస్‌ ఆంక్షలకు విరుద్ధంగా ఇరాన్‌, సిరయాకు చమురు సరఫరా చేస్తోందని, దీనిని అడ్డుకోడానికి అన్ని చర్యలు తీసుకుంటామని యుఎస్‌ విదేశాంగ కార్యదర్శి మైక్‌​ పాంపీ మంగళవారం వ్యాఖ్యానించడంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ వారం చమురు ఇన్వెస్టర్లు ఈ అంశంపై దృష్ఠి సారించే అవకాశం ఉంది. విటితో పాటు చమురు డిమాండ్‌ ఉన్నప్పటికి చమురు మార్కెట్‌లో ధరలు తిరిగి పెరిగేందుకు అగష్టు, సెప్టెంబర్‌లో చమురు ఉత్పత్తి 70 లక్షల బీపీడీ కంటే తక్కువగా చేయాలని సౌదీ అరేబియా యోచిస్తోంది. ఈ అంశం కూడా క్రూడ్‌ ధరలు పెరగడానికి సహాయపడుతుంది. అయినప్పటికి అంతర్జాతీయ మందగమన భయాల వలన చమురు లాభాలు పరిమితమవుతున్నాయి.



You may be interested

బలపడిన రూపీ..71.45 వద్ద ప్రారంభం

Wednesday 21st August 2019

రూపీ డాలర్‌ మారకంలో బుధవారం 25 పైసలు బలపడి 71.45 వద్ద ప్రారంభమైంది. అనిశ్చితిలో ఉన్న దేశియ ఆర్థిక వ్యవస్థ కారణాన గత సెషన్లో రూపీ డాలర్‌మారకంలో మరో 28 పైసలు బలహీనపడి 71.70 వద్ద ముగిసింది. ఆర్థిక మందగమనం, విదేశీ నిధుల ఔట్‌ఫ్లో దృక్పథం, చాలా వరకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలలో బలహీనత వంటి అంశాల వలన ఫారెక్స్‌ ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు. కాగా వివిధ రంగాలలో

ప్రారంభం ఫ్లాట్‌

Wednesday 21st August 2019

క్రితం రోజు ఫ్లాట్‌గా ప్రారంభమై రోజంతా హెచ్చుతగ్గులకు లోనైన తర్వాత స్వల్పనష్టాలతో ముగిసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు స్థిరంగా 37,320 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,018 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. 

Most from this category