STOCKS

News


బ్రెంట్‌ @ 80 డాలర్లు

Thursday 13th September 2018
Markets_main1536826894.png-20239

బ్రెంట్‌ క్రూడ్‌ ధర బుధవారం మళ్లీ బ్యారెల్‌కు 80 డాలర్లను తాకింది. ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర మే 22 నుంచి చూస్తే ఈ మార్క్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. లండన్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ ఫ్యూచర్స్‌ ధర బుధవారం ఒకానొక సమయంలో 80.13 డాలర్ల స్థాయికి పెరిగింది. అలాగే అమెరికా క్రూడ్‌ బెంచ్‌మార్క్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ కూడా 70.98 డాలర్లకు ఎగసింది. ఇరాన్‌ను ఏకాకిని చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. దీంతో ఇరాన్‌ నుంచి క్రూడ్‌ సరఫరా తగ్గింది. అదేసమయంలో అమెరికాలో క్రూడ్‌ నిల్వలు మూడేన్నర ఏళ్ల కనిష్టానికి క్షీణించాయి. దీంతో క్రూడ్‌ ధర పెరిగింది. 



You may be interested

హెచ్‌పీసీఎల్‌ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరీటీస్‌ బుల్లిష్‌

Thursday 13th September 2018

ముంబై:- ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) షేరుపై ప్రముఖ రేటింగ్‌ సం‍స్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సం‍స్థ బుల్లిష్‌గా ఉంది. షేరుకు ఉన్న బలమైన వాల్యూవేషన్స్‌ కారణంగా షేరుకు ‘‘బై’’కు కేటాయించినట్లు రేటింగ్‌ సం‍స్థ చెబుతోంది. హెచ్‌పీసీఎల్‌ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీష్‌ విశ్లేషణలేమిటో ఇప్పుడు చూద్దాం... సెక్టార్‌:- రీఫైనరీ సెక్టార్‌ ప్రస్తుత షేరు ధర:- రూ. 233.50 టార్గెట్‌ ధర:- రూ.476 విశ్లేషణ:- హెచ్‌సీఎల్‌సీఎల్‌ షేరు పెరిగిన పెట్రోల్‌, డిజిల్‌

ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ రేటింగ్‌ డౌన్‌

Thursday 13th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ స్టాక్‌: ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ ఇండస్ట్రీ: మెటల్స్‌ రేటింగ్‌: హోల్డ్‌ ప్రస్తుత ధర: రూ.242 టార్గెట్‌ ప్రైస్‌: రూ.230 డౌన్‌సైడ్‌: 8 శాతం సెంట్రమ్‌.. ఓరియెంట్‌ రిఫ్రాక్టరీస్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. రేటింగ్‌ను బై నుంచి హోల్డ్‌కు తగ్గించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.230గా నిర్ణయించింది. కంపెనీ పెద్ద సంస్థగా ఎదగడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. భారత్‌లో అధిక మార్కెట్‌

Most from this category