STOCKS

News


70 డాలర్లకు చేరువలో బ్రెంట్‌!

Wednesday 3rd April 2019
Markets_main1554282361.png-24956

వరుసగా నాలుగో రోజు కూడా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఒపెక్‌ ఉత్పత్తి, సరఫరా కోతలు, కొన్ని దేశాలపై యూఎస్‌ ఆంక్షల ప్రభావం.. అనే జంట కారణాలు చమురు మార్కెట్‌ను ముందుకు నడిపాయి. ఒకపక్క యూఎస్‌ నిల్వల్లో అనూహ్య పెరుగుదల నమోదయిందన్న వార్తను మార్కెట్‌ పట్టించుకోలేదు. దీంతో బ్రెంట్‌ క్రూడాయిల్‌ పీపా ధర నవంబర్‌ 12 తర్వాత తొలిసారి 69.87 డాలర్లను తాకింది. డబ్ల్యుటీఐ క్రూడ్‌ పీపా ధర 62.90 డాలర్లను తాకింది. ఒపెక ఉత్పత్తి కోతలే చమురు ధరలు పెరిగేందుకు ఆస్కారమిస్తున్నాయని, యూఎస్‌ చమురు ఉత్పత్తి మరలా పెరిగిందనేంతవరకు క్రూడ్‌ ధర పాజిటివ్‌గానే ఉండొచ్చని ఎఏఎన్‌డీఏ అనలిస్టు ఎడ్వర్డ్‌ మోయా అభిప్రాయపడ్డారు. మార్చిలో ఒపెక్‌ ప్లస్‌ దేశాల నుంచి చమురు సరఫరా నాలుగేళ్ల కనిష్ఠానికి చేరింది. మరోపక్క ఇరాన్‌పై ఆంక్షలు విధించిన అమెరికా ఎనిమిది దేశాలకు సడలింపునిచ్చింది. వీటిలో మూడు దేశాలు ఇరాన్‌ నుంచి దిగుమతులు పూర్తిగా బంద్‌ చేశాయని యూఎస్‌ తెలిపింది. అదేవిధంగా వెనుజులాపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఈ రెండు దేశాల నుంచి ఉత్పత్తయ్యే చమురు లేకున్నా, మార్కెట్‌కు ఫర్వాలేదని, వీటిపై ఆధారపడాల్సిన అవసరం లేని స్థాయిలోనే ముడి చమురు ధర ఉందని అమెరికా భావిస్తోంది. పరిస్థితులు ఇలాఉండగా గతవారం యూఎస్‌ ముడి చమురు నిల్వల్లో అనూహ్య పెరుగుదల నమోదయింది. బుధవారం ఈ నిల్వలపై అధికారిక ప్రకటనను డీఓఈ చేయనుంది. డీఓఈ ప్రకటనలో స్పష్టమైన నిల్వల పెరుగుదల కనిపించే వరకు ముడి చమురు ధరలు పెరుగుతునే ఉంటాయని మోయా చెప్పారు. 



You may be interested

ఎస్‌ఎంసీ గ్లోబల్‌ నుంచి టాప్‌ 3 సిఫార్సులు

Wednesday 3rd April 2019

స్వల్పకాలానికి మంచి రాబడినిచ్చే మూడు స్టాకులను ఎస్‌ఎంసీ గ్లోబల్‌ రికమండ్‌ చేస్తోంది. నిఫ్టీకి 11550 వద్ద మద్దతు, 11850 పాయింట్ల వద్ద నిరోధం ఉందని అంచనా వేసింది. 1. టీవీఎస్‌ మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 525. స్టాప్‌లాస్‌ రూ. 460. ఏడాది ఆరంభం నుంచి డౌన్‌ట్రెండ్‌లో ఉంది. కానీ తాజాగా చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. అక్కడనుంచి ఇటీవలే పైకి ఎగిసి కీలక డీఎంఏ స్థాయిలను దాటింది. చార్టుల్లో డబ్ల్యు

రెండోరోజూ రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Wednesday 3rd April 2019

స్టాక్‌ మార్కెట్లో రియల్టీ రంగ షేర్లు వరుసగా రెండో రోజూ ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో 2.50శాతం లాభపడింది. ఇండెక్స్‌ రెండురోజుల్లో 3శాతం పెరగ్గా, నెలరోజుల్లో ఏకంగా 21శాతం ర్యాలీ చేసింది. రియల్టీ రంగ షేర్లలో గోద్రేజ్‌ ప్రాపర్టీ షేరు నేటి ట్రేడింగ్‌లో 5శాతం ర్యాలీ చేసి రూ.937ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది చివరి

Most from this category