STOCKS

News


10డాలర్లు పెరిగిన పసిడి

Friday 8th March 2019
Markets_main1552040039.png-24495

అంతర్జాతీయ ఆర్థికవృద్ధి మందగమన ఆందోళనలు పసిడి ధరకు కలిసొస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర శుక్రవారం 10డాలర్లు లాభపడింది. డాలర్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది గరిష్టం నుంచి వెనకడుగు వేయడంతో పాటు అమెరికా పిబ్రవరి ఉద్యోగ గణాంకాల విడుదల కోసం ఇన్వెస్టర్ల ఎదురుచూపులు, ఈల్డ్‌ పతనం తదితర ప్రతికూలాంశాలు పసిడి ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 10డాలర్లు పెరిగి 1,296.05 డాలర్ల ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.3:10ని.లకు 8.65డాలర్ల లాభంతో 1,294.75డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫిబ్రవరి 20వ తేదిన 1349 డాలర్ల వద్ద ఈ ఏడాది గరిష్టాన్ని నమోదు చేసిన పసిడి ధర గత వారంలో ఏకంగా 42 డాలర్లు నష్టపోయి 1300డాలర్ల స్థాయిని కోల్పోయింది. అమెరికా నాలుగవ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు మించిన నమోదు కావడంతో డాలర్‌ కనిష్టస్థాయిని వేగంగా పుంజుకోవడం పసిడి 1300డాలర్ల మద్దతును కోల్పోడానికి కారణమైంది. 
దేశీయంగా రూ.100 పెరుగుదల:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా బలపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి రెండు నెలల గరిష్టం నుంచి రికవరీ కావడం సైతం పసిడి సానుకూలాంశంగా మారింది. దేశీయ బులియన్‌ మార్కెట్లో 10గ్రాములు పసిడి ధర గత ముగింపు ధర(రూ.32134)తో పోలిస్తే రూ.100ల లాభంతో రూ.32034ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ ఆరు షేర్లూ కొనొచ్చు-కొటక్‌

Friday 8th March 2019

లోక్‌సభ ఎన్నికలు, అమెరికా–చైనా వాణిజ్య భయాలు, బ్రెగ్జిట్‌ తదితర అంశాల కారణంగా ఈ ఏడాది అంతా ఒడుదుడుకులమయంగా మార్కెట్‌ వుంటుందని, ఈ తరుణంలో... గత ఏడాదికాలంగా పతనమైన షేర్ల నుంచి ఆయా రంగాల్లో నాణ్యతగలిగిన వాటిలో ఇన్వెస్ట్‌ చేయవచ్చని కొటక్‌ సెక్యూరిటీస్‌ సూచించింది. లార్జ్‌క్యాప్స్‌ నుంచి మంచి వృద్ధి కనపరుస్తున్నవాటిని, మిడ్‌క్యాప్స్‌ నుంచి మంచి యాజమాన్యం కలిగి, సబబైన విలువలతో ట్రేడవుతున్నవాటిని కొనవచ్చని కొటక్‌ విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.

కళ తప్పిన మెటల్‌ షేర్లు

Friday 8th March 2019

ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్ల పతనంతో దేశీయ మార్కెట్లో సైతం మెటల్‌ షేర్లు రంగాల బాటపట్టాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో చైనా ఫిబ్రవరి ఆర్థిక మిగులు గణాంకాలు నిరుత్సాహపరిచాయి. గతవారంలో విడుదలైన ఫిబ్రవరి వాణిజ్య మిగులు 4.12 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అలాగే ఎగుమతులు 21శాతానికి పతనమగా, దిగుమతులు 5.2శాతానికి చేరుకున్నాయి. ఆర్థిక మందగమనం ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో మెటల్‌ భారీ క్షీణించాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ

Most from this category