రెండు వైపుల స్క్రీన్‌తో వివో కొత్త ఫోన్
By Sakshi

స్మార్ట్‌ఫోన్స్‌లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు ఇటీవల కాలంలో ముందు వరుసలో ఉంటున్నాయి. వివో తాజాగా డ్యూయెల్ డిస్ప్లే ఫీచర్‌తో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. దీని పేరు నెక్స్ డ్యూయెల్ డిస్ప్లే ఎడిషన్. ఇందులో ముందు వెనుక రెండు వైపుల డిస్ప్లే ఉంటుంది. దీని ధర దాదాపుగా రూ.52,000 ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్స్ డిసెంబర్ 29 నుంచి అక్కడి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. నెక్స్ డ్యూయెల్ డిస్ప్లే ఎడిషన్‌లోని ప్రత్యేకతలను గమనిస్తే.. ≈ డ్యూయెల్ డిస్ప్లే: ముందువైపు 6.39 అంగుళాల అల్ట్రా ఫుల్‌వ్యూ ఆమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. అంటే నాచ్, వాటర్ డ్రాప్ డిస్ప్లే లాంటివి కాదు. స్క్రీన్ మొత్తం డిస్ప్లే ఉంటుంది. ఇక వెనుక భాగంలో 5.49 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే ఉంటుంది.
≈ టాప్-ఎండ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను అమర్చారు.
≈ 10 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ ఉంటుంది.
≈ ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.
≈ డ్యూయెల్ సిమ్ కార్డ్ సౌలభ్యముంది.
≈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా (12 ఎంపీ మెయిన్ కెమెరా + 2 ఎంపీ నైట్ విజన్ కెమెరా+ టీఓఎఫ్ 3డీ కెమెరా) ఉంటుంది. రియర్ కెమెరాలతో సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు.
≈ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయి.
You may be interested
వృద్ది మాత్రమే కావాలంటే రిస్కు తప్పదు!
Saturday 15th December 2018రాజన్ హెచ్చరిక ప్రభుత్వం స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని మరచి కేవలం వృద్ధి పైనే దృష్టి సారిస్తే రిస్కులు తప్పవని ప్రముఖ ఆర్ధికవేత్త రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఎకానమీల్లో ఒకటైన భారత్ వృద్ది ధ్యాసలో పడి మాక్రో ఎకనమిక్ స్టెబిలిటీని పణంగా పెడితే అనర్ధాలు తప్పవని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టు గీతా గోపినాధ్ సైతం హెచ్చరిస్తున్నారు. స్థూల ఆర్థిక స్థిరత్వ సాధనకు స్థిరమైన అల్పద్రవ్యోల్బణాన్ని మెయిన్‌టెయిన్ చేయడం, ప్రైవేట్
క్రాష్ టెస్ట్: ఈ కారుకు 5 స్టార్
Saturday 15th December 2018టాటా నెక్సన్ ఘనత రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంచి చనిపోతున్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా రోడ్డు భద్రత ప్రధాన సమస్యగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో సురక్షితమైన కార్ల తయారీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ కార్ల తయారీ కంపెనీలు ఇప్పుడిప్పుడే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో టాటా మోటార్స్ ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలిచింది. కంపెనీ సబ్‌కాంపాక్ట్ ఎస్యూవీ కారు ‘టాటా నెక్సన్’