STOCKS

News


అదిరిపోయే ఫోటోలకు ‘ఎంఐ ఏ2’

Thursday 9th August 2018
auto-mobiles_main1533791783.png-19069

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ ఏ2 ‘ఆండ్రాయిడ్‌ వన్’ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత్‌లో విడుదలచేసింది. ఫోటోగ్రఫీ సామర్థ్య పెంపు ఈ ఫోన్‌లో అదనపు ఆకర్షణగా ఉందని సంస్థ ఎండీ, వైస్‌ ప్రెసిడెంట్‌ మనూ జైన్‌ తెలిపారు. వెనుక వైపు 12 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్‌ రేర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ డ్యుయల్‌ కెమెరాలు కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌.. ముందుభాగంలో 20ఎంపీ కెమెరాను కలిగిఉందని ఆయన వివరించారు. భారత్‌లో అమ్ముడయ్యే ఏ2 మొబైల్స్‌ పూర్తిస్థాయిలో ఇక్కడే ఉత్పత్తి అవుతాయని వెల్లడించారు. ఆగస్టు 16న ఎంఐ డాట్‌ కామ్‌, అమేజాన్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండనుండగా.. ముందస్తు బుకింగ్స్‌ ఆగస్టు 9 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. 



You may be interested

బీపీసీఎల్‌ లాభం మూడు రెట్లు జంప్‌

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీపీసీఎల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.745 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.2,293 కోట్లకు పెరిగిందని బీపీసీఎల్ తెలిపింది. ఒక్కో షేర్‌ పరంగా నికర లాభం రూ.3.79 నుంచి రూ.11.66కు ఎగసిందని భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) పేర్కొంది. టర్నోవర్‌ 23 శాతం వృద్ధితో

రూ.2.14 లక్షల కోట్ల షేర్లు తనఖాలోనే!!

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: బీఎస్‌ఈలో లిస్టైయిన కంపెనీలలోని ప్రమోటర్ల తనఖా షేర్ల విలువ జూలై చివరినాటికి రూ.2.45 లక్షల కోట్లకు చేరుకుని 14.60 శాతం పెరుగుదలను నమోదుచేసినట్లు ఎక్స్ఛేంజ్‌ సమాచారంలో వెల్లడయింది. జూన్‌ 30 నాటికి ఈ మొత్తం రూ.2.14 లక్షల కోట్లుగా నమోదైంది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో 400 వరకు కంపెనీల ప్రమోటర్లు 30 శాతానికి మించి తమ వాటాలను తనఖా పెట్టినట్లు వెల్లడి కాగా, ఈ మొత్తం విలువ రూ.1.29

Most from this category