STOCKS

News


వాయిస్‌ ఆదేశాలతో టీవీ!!

Wednesday 10th October 2018
auto-mobiles_main1539146951.png-20994

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టీవీ పనిచేయాలంటే రిమోట్‌ వాడాలి. అసలు రిమోట్‌ను ఆపరేట్‌ చేసే అవసరం లేకుండా మాటలతోనే పనిచేస్తే..! ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఎల్‌జీ భారత్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే థింక్యూ టీవీలను ప్రవేశపెట్టింది. చానెల్‌, పాటలు, వీడియోలు, గేమ్స్‌, ఫోటోలు.. ఇలా ఏది కావాలన్నా వాయిస్‌తో ఆదేశిస్తే చాలు. టీవీ పనిచేస్తుంది. ఇంట్లో ఇంటర్నెట్‌ ఉండాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషం. 32-77 అంగుళాల సైజులో మొత్తం 25 మోడళ్లను మంగళవారమిక్కడ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.30 వేలతో ప్రారంభమై రూ.30 లక్షల వరకు ఉన్నాయి.
యూహెచ్‌డీ 40 శాతం..
దేశవ్యాప్తంగా 2017లో ఒక కోటి ఫ్లాట్‌ ప్యానెల్‌ టీవీలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 1.3 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. పరిశ్రమలో తమ కంపెనీకి 25 శాతం వాటా ఉందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ యూంచుల్‌ పార్క్‌ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది పండుగల సీజన్లో జరిగిన కంపెనీ అమ్మకాల్లో అల్ట్రా హెచ్‌డీ టీవీల వాటా 14 శాతం. ఈ సీజన్లో ఇది 40 శాతానికి చేరుకుంటుందని ధీమాగా చెప్పారు. కస్టమర్లు తమ చిన్న టీవీల స్థానంలో పెద్ద స్క్రీన్లతో రీప్లేస్‌ చేస్తుండడం అధికంగా జరుగుతోందని వెల్లడించారు. 



You may be interested

కేంద్రం ముందుకు బీవోబీ విలీన ప్రతిపాదన

Wednesday 10th October 2018

ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ), దేనా, విజయా బ్యాంక్ విలీన ప్రతిపాదన కేంద్రం ముందుకు చేరింది. తుది అనుమతుల కోసం మూడు బ్యాంకులు విలీన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ పీఎస్ జయకుమార్ తెలిపారు. షేర్ల విలీనం, మార్పిడి నిష్పత్తి తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి లాంఛనంగా అనుమతులు వచ్చాక.. విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. ఇది పూర్తి

హోండా నుంచి కొత్త ‘సీఆర్‌-వీ’

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: జపనీస్‌ ఆటోమేజర్‌ హోండా... సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని మంగళవారం భారత మార్కెట్‌లో విడుదలచేసింది. సీఆర్‌-వీ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈకారు మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. టూవీల్‌ డ్రైవ్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.28.15 లక్షలు, డీజిల్‌ ధర రూ.28.15 లక్షలు కాగా, ఆల్‌వీల్‌ డ్రైవ్‌ ధర రూ.30.65 లక్షలుగా నిర్ణయించినట్లు హోండా కార్స్‌ ఇండియా సీఈఓ గకు నకనిషి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కస్టమర్లు

Most from this category