STOCKS

News


జియోఫోన్లలో వాట్స్‌యాప్‌

Wednesday 12th September 2018
auto-mobiles_main1536729027.png-20179

హైదరాబాద్‌: ఇక నుంచి రిలయన్స్‌ జియో విక్రయిస్తున్న అన్ని ఫోన్లలో వాట్స్‌యాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని మంగళవారం రిలయన్స్‌ రిటైల్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత్‌లో అమ్ముడవుతున్న రూ.1,500 లోపు మొబైల్స్‌లో తమ మార్కెట్‌ వాటా 80 శాతానికి చేరుకుందని రిలయన్స్‌ ప్రకటించింది. ఈ విభాగానికి చెందిన ప్రతి 10 ఫోన్ల అమ్మకాలలో 8 జియో ఫోన్లు ఉంటున్నాయని, జియోఫోన్‌ ద్వారా ట్రాన్స్‌మిట్‌ అవుతున్న వాయిస్ సందేశాలు స్మార్ట్‌ఫోన్ల కంటే ఏకంగా ఐదు శాతం ఎక్కువగా నమోదవుతున్నాయని తెలియజేసింది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కంటే ఈ ఫోన్‌ యూజర్లే అధిక సమయం ఇంటర్‌నెట్‌లో గడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ఇక నుంచి అన్ని జియోఫోన్లలో వాట్స్‌యాప్‌ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.
 



You may be interested

డీమ్యాట్‌ రూపంలోనే కొత్త షేర్ల జారీ

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కె‍ట్లో లిస్ట్‌ కాని కంపెనీలు కొత్త షేర్లను వచ్చే నెల 2 నుంచి డీమ్యాట్‌ రూపంలోనే జారీ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ కంపెనీలు డీ మ్యాట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ రూపంలోనే షేర్లను బదిలీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమ నిధుల వరదను నిరోధించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. పారదర్శకతను మరింతగా పెంచడానికి, ఇన్వెస్టర్ల రక్షణ నిమిత్తం,

73కు చేరువలో రూపీ

Wednesday 12th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం మరో కొత్త రికార్డ్‌ కనిష్ట స్థాయికి పతనమైంది. 73 మార్క్‌కు కేవలం 10 పైసలు దూరంలో నిలిచింది. క్రూడ్‌ ధరలు పెరగటం, వర్ధమాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.89 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 72.70తో పోలిస్తే 0.25 శాతం తగ్గింది. ఇక డాలర్‌తో

Most from this category