STOCKS

News


టయోటా ధరలు పెరుగుతున్నాయ్‌

Wednesday 28th November 2018
auto-mobiles_main1543390341.png-22441

న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వాహనాల ధరలు పెరగనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచీ అన్ని మోడళ్లపై 4 శాతం వరకూ ధరల పెంపు ఉంటుందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ తెలియజేసింది. రూపాయి విలువ బలహీనత వల్ల తయారీ వ్యయాలు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పెరిగే తయారీ వ్యయాలకు అనుగుణంగా ధరల సమీక్ష, అందుకు తగిన నిర్ణయాలు కంపెనీకి సాధారణ అంశమేనని సంస్థ వివరించింది. కంపెనీ ప్రస్తుతం రూ.5.25 లక్షల విలువ చేసే హ్యాచ్‌బ్యాక్‌ లివా నుంచి రూ.1.41 కోట్ల విలువైన లగ్జరీ ఎస్‌యూవీ ల్యాండ్‌ క్రూజర్‌ వరకూ వివిధ మోడళ్ల వాహనాలను విక్రయిస్తోంది. 



You may be interested

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వెయ్యికి పైగా శామ్‌సంగ్‌ ఉద్యోగాలు

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: గృహోపకరణాల  దిగ్గజం శామ్‌సంగ్‌ ఇండియా వెయ్యికి పైగా ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఉద్యోగాలినివ్వనున్నది. వీటిల్లో 300 మందిని వివిధ ఐఐటీల నుంచి తీసుకుంటామని శామ్‌సంగ్‌ ఇండియా హెడ్‌(హ్యుమన్‌ రిసోర్సెస్‌) సమీర్‌ వాధ్వాన్‌ తెలిపారు. వచ్చే నెల 1 నుంచి ఢిల్లీ, కాన్సూర్‌, బాంబే, మద్రాస్‌, ఖర్గపూర్‌, గౌహతి, రూర్కీ ఐఐటీల్లో ఉద్యోగ నియామకాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొత్త ఐఐటీలైన హైదరాబాద్‌, ధన్‌బాద్‌, రోపార్‌, ఇండోర్‌, గాంధీనగర్‌, పాట్నా, భువనేశ్వర్‌, మండి, జోధ్‌పూర్‌లతో

20 లక్షల కార్ల క్లబ్‌లో మారుతీ స్విఫ్ట్‌

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనికీ చెందిన స్విఫ్ట్‌ మోడల్‌ 20 లక్షల అమ్మకాల మైలురాయిని సాధించింది. ఈ ఘనత సాధించడం ఉద్యోగులందరికీ గర్వకారణంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌​ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆర్‌.ఎస్‌. కల్సి చెప్పారు. 2005, మే నెలలో స్విఫ్ట్‌ కారును మార్కెట్లోకి తెచ్చామని, ఐదేళ్లలోనే (2010, సెప్టెంబర్‌) 5 లక్షల అమ్మకాలు సాధించామని తెలిపారు.  మరో మూడేళ్లలోనే (2013, సెప్టెంబర్‌) 10

Most from this category