News


మార్కెట్‌లోకి థామ్సన్‌ స్మార్ట్‌ టీవీలు 

Friday 13th April 2018
auto-mobiles_main1523631131.png-15496

  • ప్రారంభ ధర రూ.13,499

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కన్సూమర్‌ బ్రాండ్‌ ‘థామ్సన్‌’ తాజాగా మూడు స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 43 అంగుళాల అల్ట్రాహెచ్‌డీ 4కే, 40 అంగుళాల హెచ్‌డీ, 32 అంగుళాల హెచ్‌డీ రెడీ టీవీలు ఇందులో ఉన్నాయి. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫ్లాష్‌ సేల్‌ ఏప్రిల్‌ 18 అర్ధరాత్రి ప్రారంభమౌతుందని పేర్కొంది. 43 అంగుళాల అల్ట్రాహెచ్‌డీ 4కే స్మార్ట్‌టీవీలో జీమెయిల్‌, యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి యాప్స్‌ను డిపాల్ట్‌గా ఉంటాయని, ఈ టీవీ ఆండ్రాయిడ్‌ 4.4.4.0 ఓఎస్‌పై పనిచేస్తుందని వివరించింది. కాగా థామ్సన్‌ బ్రాండ్‌ టెక్నికలర్‌ కంపెనీది. ఇది భారత్‌లో ఎస్‌పీపీఎల్‌తో లైసెన్స్‌ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. 43 అల్ట్రాహెచ్‌డీ 4కే- ధర రూ.27,999 కాగా... 40 ఫుల్‌హెచ్‌డీ ధర రూ.19,999. ఇక 32 హెచ్‌డీ రెడీ  ధర రూ.13,499.
 



You may be interested

రికార్డ్‌ స్థాయికి ఫారెక్స్‌ నిల్వలు

Friday 13th April 2018

424.86 బిలియన్‌ డాలర్లుగా నమోదు ముంబై: దేశీ విదేశీ మారక నిల్వలు రికార్డ్‌ స్థాయికి చేరాయి. ఇవి ఏప్రిల్‌ 6తో ముగిసిన వారంలో 503.6 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో ఆల్‌టైమ్‌ హై 424.86 బిలియన్‌ డాలర్లకి ఎగశాయి. దేశీ మారకపు నిల్వల్లో ముఖ్యమైన విదేశీ కరెన్సీ ఆస్తుల పెరుగుదలే దీనికి ప్రధాన కారణం. ఇవి 657.7 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 399.77 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గత కొన్ని వారాలుగా

ఎంబైబ్‌లో వాటా కొన్న రిలయన్స్‌

Friday 13th April 2018

 73 శాతం వాటాల కొనుగోలు  మూడేళ్లలో రూ. 1,175 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సేవల సంస్థ ఇండియావిడ్యువల్ లెర్నింగ్ (ఎంబైబ్‌)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 73 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. వచ్చే మూడేళ్లలో సుమారు 180 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,175 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు గురవారం ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. దీని ప్రకారం ఇండియావిడ్యువల్ లెర్నింగ్‌లో 34.33 లక్షల షేర్లను

Most from this category