News


కెమాన్‌ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు

Thursday 27th September 2018
auto-mobiles_main1538022997.png-20615

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ టెక్నో మొబైల్‌ తాజాగా కెమాన్‌ సిరీస్‌లో మూడు మోడళ్లను బుధవారం ప్రవేశపెట్టింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ సాంకేతికతో కూడిన కెమెరాలు వీటి ప్రత్యేకత అని టెక్నోను ప్రమోట్‌ చేస్తున్న ట్రాన్సియాన్‌ ఇండియా సీఎంవో గౌరవ్‌ టికూ మీడియాకు తెలిపారు. ఎలాంటి వెలుతురులోనైనా చిత్రాలను తీయగలదని చెప్పారు. లైటింగ్‌ కండీషన్‌, బ్రైట్‌నెస్‌ ఆధారంగా సీన్‌ను అంచనా వేసి ఫోటోకు అందాన్ని తెచ్చేందుకు ఆటో సీన్‌ డిటెక్షన్‌ ఫీచరును పొందుపరిచారు. హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా ఉన్న ట్రాన్సియాన్‌ 50 దేశాల్లో ఐటెల్‌, ఇన్‌ఫినిక్స్‌, టెక్నో బ్రాండ్లలో ఫోన్లను అమ్ముతోంది. 2017లో మొత్తం 13 కోట్ల ఫోన్లు విక్రయించింది. 
ఇవీ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు..
6.2 అంగుళాల 19:9 సూపర్‌ ఫుల్‌ వ్యూ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ ఫేస్‌ అన్‌లాక్‌, ఆన్‌డ్రాయిడ్‌ 8.1 ఓఎస్‌, 3,750 ఎంఏహెచ్‌ బ్యాటరీ వీటికి పొందుపరిచారు. కెమాన్‌ ఐ ఎయిర్‌2 మోడల్‌లో 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 13+2 ఎంపీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. ధర రూ.8,999. కెమార్‌ ఐ2 మోడల్‌ 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 13+2 ఎంపీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచారు. ధర రూ.10,499. కెమాన్‌ ఐ2ఎక్స్‌ను 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 13+5 ఎంపీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను చేర్చారు. ధర రూ.12,499గా నిర్ణయించారు. 100 రోజుల్లో రీప్లేస్‌మెంట్‌ వారంటీ, వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ను అందిస్తోంది.

 



You may be interested

నంబరు పోర్టబిలిటీ మరింత సులభతరం

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) మరింత సులభతరం చేసే క్రమంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను సడలించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలు చేసింది. వీటి ప్రకారం ఇకపై యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ)ని జనరేట్ చేసే బాధ్యతను ఎంఎన్‌పీ సర్వీస్ ప్రొవైడర్‌ (ఎంఎన్‌పీఎస్‌పీ)కి అప్పగించింది. ప్రస్తుత విధానం ప్రకారం టెలికం సంస్థే దీన్ని జనరేట్ చేసి సబ్‌స్క్రయిబర్‌కి పంపుతోంది. అయితే, నంబర్ పోర్ట్‌ చేసుకోవడానికి

ఫెడ్ రేటు పావు శాతం పెంపు..

Thursday 27th September 2018

వాషింగ్టన్‌: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతానికి చేరింది. ఉద్యోగాల కల్పన మెరుగ్గా ఉండటం, వ్యాపారాలపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజుల ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం ఫెడ్‌ వెల్లడించింది. దీంతో 2015 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు వడ్డీ రేట్లు పెంచినట్లయింది. ఈ ఏడాది

Most from this category