News


టియాగో ఎక్స్‌జెడ్‌ ప్లస్‌ విడుదల

Wednesday 12th December 2018
auto-mobiles_main1544592096.png-22852

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తన పాపులర్‌ వాహనం టియాగోలో కొత్త వేరియంట్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది.  ‘టియాగో ఎక్స్‌జెడ్‌ ప్లస్‌’ పేరుతో విడుదలైన ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.5.57- 5.64 లక్షలు కాగా, డీజిల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.6.31- 6.38 లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్యాసింజర్‌ వాహన విభాగ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌) ఎస్‌.ఎన్‌.బర్మన్‌ మాట్లాడుతూ.. ‘ఈ కారును కస్టమర్లు ఎంతో ఇష్టపడతారని భావిస్తున్నాం. ప్యాసింజర్‌ వాహన వ్యాపారంలో అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ఈ వేరియంట్‌ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం.’ అని అన్నారయన.



You may be interested

ఎర్నింగ్స్‌పై కన్నేయండి!

Wednesday 12th December 2018

దాస్‌ నియామకం ముగిసిన కధ క్యు3 ఫలితాలే ఇకపై మార్కెట్లకు ట్రిగ్గర్‌ బ్రోకరేజ్‌ల అంచనా ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ నియామకాన్ని మార్కెట్లు జీర్ణించుకున్నాయని, ఇకపై సూచీల్లో అప్‌మూవ్‌కు ఎర్నింగ్సే ఆధారమని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా అనంతరం శక్తికాంత్‌దాస్‌ను మూడేళ్ల కాలపరిమితితో ఆర్‌బీఐకి గవర్నర్‌గా ప్రభుత్వం నియమించింది. మరికొన్ని రోజుల్లో ఆర్‌బీఐ కీలక మీటింగ్‌ జరగనుంది. ఉర్జిత్‌ రాజీనామా, దాస్‌ నియామకాన్ని మార్కెట్లు స్వాగతించినట్లు కనిపిస్తున్నాయని, ఇప్పటికే ఈ అంశాలను మార్కెట్లు

ప్రధాని ఆర్థిక సలహా మండలికి భల్లా రాజీనామా

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: కేంద్రం స్థాయిలో ఆర్థిక వేత్తల రాజీనామా పరంపర కొనసాగుతోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో (పీఎంఈఏసీ) సభ్యుడైన ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుర్జిత్‌ భల్లా తాను సైతం రాజీనామా చేసినట్టు మంగళవారం ప్రకటించారు. డిసెంబర్‌ 1 నుంచి పీఎంఈఏసీ తాత్కాలిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు భల్లా ట్వీట్‌ చేశారు. భల్లా రాజీనామాను ప్రధానమంత్రి

Most from this category