క్రాష్ టెస్ట్: ఈ కారుకు 5 స్టార్
By Sakshi

రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంచి చనిపోతున్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా రోడ్డు భద్రత ప్రధాన సమస్యగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో సురక్షితమైన కార్ల తయారీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ కార్ల తయారీ కంపెనీలు ఇప్పుడిప్పుడే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో టాటా మోటార్స్ ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలిచింది. కంపెనీ సబ్‌కాంపాక్ట్ ఎస్యూవీ కారు ‘టాటా నెక్సన్’ ఇటీవలి గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ మోడల్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరిలో 5 స్టార్ రేటింగ్‌ను, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరిలో 3 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. మేడిన్ ఇండియా కార్లలో 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్న తొలి కారు టాటా నెక్సన్ కావడం గమనార్హం. కాగా టాటా నెక్సన్ ఇదివరకటి (ఈ ఏడాది ప్రారంభంలో) క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ దక్కించుకుంది. అయితే తర్వాత కంపెనీ ఈ మోడల్‌కు సీట్ బెల్ట్ రిమైండర్ వంటి పలు ఫీచర్లను జత చేయడంతో తాజా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. కాగా 5 స్టార్ దక్కించుకున్న టాటా నెక్సన్ మోడల్‌ను ఇటీవల స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం.
‘నెక్సన్ క్రాష్ టెస్ట్ సమయంలో ప్యాసింజర్ల తల, మెడ భాగాలకు మంచి రక్షణ లభించింది. అదే సమయంలో డ్రైవర్ ఛాతికి కొంత తక్కువ రక్షణ, ప్యాసింజర్ ఛాతికి సరిపడే రక్షణ లభించింది’ అని గ్లోబల్ ఎన్సీఏపీ పేర్కొంది. ‘భారత్‌లో కారు సేఫ్టీకి సంబంధించి టాటా నెక్సన్ 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకోవడం ఒక పెద్ద మైలురాయి లాంటి ఘటన. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్న టాటా మోటార్స్‌కు అభినందనలు’ అని గ్లోబల్ ఎన్సీఏపీ సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్డ్ తెలిపారు.
You may be interested
రెండు వైపుల స్క్రీన్‌తో వివో కొత్త ఫోన్
Saturday 15th December 2018స్మార్ట్‌ఫోన్స్‌లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు ఇటీవల కాలంలో ముందు వరుసలో ఉంటున్నాయి. వివో తాజాగా డ్యూయెల్ డిస్ప్లే ఫీచర్‌తో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. దీని పేరు నెక్స్ డ్యూయెల్ డిస్ప్లే ఎడిషన్. ఇందులో ముందు వెనుక రెండు వైపుల డిస్ప్లే ఉంటుంది. దీని ధర దాదాపుగా రూ.52,000 ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్స్ డిసెంబర్ 29 నుంచి అక్కడి
వర్ధమానదేశ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు శీతకన్ను
Saturday 15th December 2018విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమానదేశ మార్కెట్లలో పెట్టుబడుల విషయంలో శీతకన్ను వేస్తున్నారు. ఈ డిసెంబర్ ప్రారంభం నుంచి వర్ధమాన దేశ మార్కెట్ల నుంచి 600 మిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. ఎఫ్ఐఐలు వెనక్కి తీసుకున్న మొత్తం పెట్టుబడుల్లో 500 మిలియన్ డాలర్లు భారత్, తైవాన్ దేశాల నుంచే కావడం విశేషం. అలాగే మలేషియా, సౌత్‌కొరియా, థాయిలాండ్ దేశాల నుంచి రూ.100 మిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూరప్ దేశాల్లో