STOCKS

News


టియాగో ఎన్ఆర్‌జీ @ రూ.5.49 లక్షలు

Thursday 13th September 2018
auto-mobiles_main1536813552.png-20216

న్యూఢిల్లీ: టియాగో హచ్‌బ్యాక్‌ అధునాతన వెర్షన్‌ను టాటా మోటార్స్ బుధవారం విడుదలచేసింది. ‘టియాగో ఎన్ఆర్‌జీ’ పేరిట విడుదలైన ఈ ఎస్‌యూవీలో మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, ట్యూన్డ్ సస్పెన్షన్ వంటి ఫ్యూచర్లతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉండడంతో భద్రతా వ్యవస్థ మునుపటి వెర్షన్ల కంటే ఎక్కువని టాటా మోటార్స్‌ సీఈఓ, ఎండీ గుంటెర్ బుషెక్‌ వివరించారు. 5-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన ఎన్ఆర్‌జీని ‘అర్బన్ టఫ్‌రోడ్డర్‌’గా అభివర్ణించారు. 1.2 పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ ధర రూ.5.49 లక్షలు, 1.05 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ ధర రూ.6.31 లక్షలుగా ప్రకటించారు.



You may be interested

నెల రోజుల్లో 5 మొండిపద్దుల పరిష్కారం

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: సుమారు రూ.8,254 కోట్ల మేర రుణాలు పొందిన అయిదు మొండి పద్దుల సమస్య నెలరోజుల్లో ఒక కొలిక్కి రావొచ్చని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్ శర్మ అంచనా వేశారు. ఈ లోగా వీటి  పరిష్కార ప్రక్రియ అమలు చేసే అవకాశాలున్నాయని చెప్పారాయన. జీఎంఆర్ చత్తీస్‌గఢ్, జబువా పవర్‌, కేఎస్‌కే మహానది పవర్ ప్రాజెక్టులకు సంబంధించి అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్లతో చర్చలు దాదాపు తుది దశలో

చిన్న చమురు క్షేత్రాల్లోకి రూ.8,400 కోట్ల పెట్టుబడులు

Thursday 13th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: చిన్న స్థాయి చమురు, సహజ వాయువు నిక్షేపాల రెండవ రౌండు వేలం అనంతరం ఆయా క్షేత్రాల్లోకి సుమారు రూ.8,400 కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశం ఉందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) వి.పి.జాయ్‌ అంచనా వేశారు. చిన్న క్షేత్రాల అన్వేషణ (డీఎస్‌ఎఫ్‌) మొదటి రౌండు వేలంతో పోలిస్తే రెండో రౌండులో విజేతలైన బిడ్డర్లు రెట్టింపు పెట్టుబడులు పెట్టే అవకాశమున్నట్లు ఆయన చెప్పారు. రెండో విడత వేలంలో

Most from this category