STOCKS

News


టాటా కార్లు ప్రియం!!

Thursday 13th December 2018
auto-mobiles_main1544682677.png-22892

  • జనవరి 1 నుంచి రూ.40,000 వరకు పెంపు 

ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తాజాగా ప్యాసింజర్‌ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. మోడల్‌ ప్రాతిపదికన ధరల పెంపు రూ.40,000 వరకు ఉండొచ్చని తెలిపింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల సహా పలు ఇతర అంశాల కారణంగా వాహన ధరలను పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌​(ప్యాసింజర్‌ వాహన విభాగం) మయాంక్‌ పరీక్‌ పేర్కొన్నారు. 
 
కాగా టాటా మోటార్స్‌ భారత్‌లో ఎంట్రీ లెవెల్‌ కారు నానో మొదలు ప్రీమియం ఎస్‌యూవీ హెక్సా వరకు పలు మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధర రూ.2.36 లక్షలు నుంచి రూ.17.97 లక్షల వరకు ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి. 

ఇకపోతే టాటా మోటార్స్‌ తన కొత్త ప్రీమియం ఎస్‌యూవీ హరియర్‌ను జనవరిలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. 

ఇప్పటికే మారుతీ సుజుకీ, టయోటా కిర్లోస్కర్‌, బీఎండబ్ల్యూ, ఇసుజు సంస్థలు జనవరి 1 నుంచి వాహన ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా టాటా మోటార్స్‌ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. 
 



You may be interested

ఎస్‌బీఐ ర్యాలీ..కారణమిదే!!

Thursday 13th December 2018

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) షేరు గురువారం మార్నింగ్‌ సెషన్‌లో 3 శాతం మేర ర్యాలీ చేసింది. ప్రముఖ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ.. ఎస్‌బీఐ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.350 నుంచి రూ.375కి పెంచడం షేరు ధరపై సానుకూల ప్రభావం చూపింది. అలాగే మోర్గాన్‌ స్టాన్లీ.. ఎస్‌బీఐపై ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను కొనసాగించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో బ్యాంక్‌ మొండి బకాయిల కేటాయింపులు బాగా తగ్గుతాయని

స్వల్పంగా తగ్గిన పసిడి

Thursday 13th December 2018

డాలర్‌ స్థిరమైన ర్యాలీతో పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.50డాలర్‌ నష్టపోయి 1,249.30 డాలర్‌ వద్ద  ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97.08 వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఈ దేశ ప్రధాని థెరిస్సా మే పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోవడంతో పాటు వాణిజ్య వివాదాలు సమిసిపోయేందుకు అమెరికాతో మరిన్ని

Most from this category