STOCKS

News


‍స్పీడు పెంచిన ‘టాటా’

Saturday 27th October 2018
auto-mobiles_main1540610213.png-21515

న్యూఢిల్లీ: రేసు కార్లపై దృష్టిసారించిన టాటా మోటార్స్‌... కోయంబత్తూర్‌ సంస్థ జయం ఆటోమోటివ్స్‌తో కలిసి దేశీ మార్కెట్‌లో రెండు సరికొత్త కార్లను శుక్రవారం విడుదలచేసింది. టియాగో జేటీపీ, టైగర్ జేటీపీ పేరిట విడుదలైన ఈ కార్లలో శక్తివంతమైన 1.2 -లీటర్ టర్బోచార్జిడ్ న్యూ జనరేషన్‌ రివోట్రన్‌ పెట్రోల్ ఇంజిన్‌లను అమర్చినట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఈ స్థాయి ఇంజిన్‌ నుంచి 112 బీహెచ్‌పీ, 150 ఎన్‌ఎం పీక్ టార్క్ విడుదలై.. కేవలం 10 సెకన్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కారు అందుకోగలుగుతుందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ వివరించారు. యువతను దృష్టిలో ఉంచుకునే వీటిని మార్కెట్లోకి తెచ్చినట్లు చెప్పారాయన. ధరల విషయానికి వస్తే.. హచ్‌బ్యాక్‌ టియాగో జేటీపీ రూ.6.39 లక్షలు, సెడాన్‌ టియాగో జేటీపీ రూ.7.49 లక్షలు. టిగోర్ జేటీపీ ప్రారంభ ధర రూ.5.5 లక్షలు కాగా, టాప్‌ ఎండ్‌ మోడల్‌ ధర రూ.6.5 లక్షలు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 30 మంది డీలర్ల వద్ద మాత్రమే బుకింగ్స్‌కు అవకాశం ఉంది. కోల్‌కతా, ఢిల్లీ, గురుగ్రామ్‌, చండీగఢ్, లక్నో, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్, ముంబై, కన్నూర్, త్రిశూర్, కొచ్చిలో బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.



You may be interested

మళ్లీ లాభాల్లోకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: మొండిబకాయిల దెబ్బతో నష్టాల్లోకి జారిపోయిన ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.1,205 కోట్ల నికర లాభాన్ని(‍కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. గతేడాదిక్యూ2లో రూ.2,071 కోట్లతో పోలిస్తే 42 శాతం క్షీణించింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో బ్యాంకుకు రూ.120 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.30,191 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం రూ.31,915

ఎగుమతులకు తాజా ప్రోత్సాహకాలు

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: ఎగమతిదారులకు ప్రోత్సాహకాలివ్వడం ద్వారా ఎగుమతుల్ని పెంచేందుకు సమగ్ర విధానాన్ని తేవటంపై కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. 2017-18లో ఎగుమతులు 10 శాతం పెరిగి 300 బిలియన్‌ డాలర్లుగా ఉన్న విషయాన్ని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ (విదేశీ వాణిజ్య విభాగం) అలోక్‌ చతుర్వేది తెలియజేశారు. సీఐఐ నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 330-340 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు

Most from this category