STOCKS

News


సుజుకీ ‘వీ-స్ట్రోమ్‌ 650 ఎక్స్‌టీ’ విడుదల

Friday 5th October 2018
auto-mobiles_main1538713864.png-20877

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా భారత మార్కెట్‌లో గురువారం తమ అడ్వెంచర్ టూరర్‌ బైక్‌ను విడుదలచేసింది. ‘వీ-స్ట్రోమ్‌ 650 ఎక్స్‌టీ ఏబీఎస్‌’ పేరిట విడుదలైన ఈ బైక్‌ ధర రూ.7.46 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఫోర్‌-సిలెండర్‌ 645 సీసీ ట్విన్‌ ఇంజిన్‌, అధునాతన భద్రతా ఫీచర్లు, యాంటీ లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌(ఏబీఎస్‌) ప్రత్యేకతలుగా పేర్కొంది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతోషి ఉచిడా మాట్లాడుతూ.. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు బైక్‌ లాంచింగ్‌లను పూర్తిచేశాం. ఈ నూతన బైక్‌లో పూర్తిగా అభివృద్ధి పరిచిన అధునాతన టెక్నాలజీతో పాటు భద్రతా పరంగా కూడా అత్యధునిక స్థాయిని పాటించాం. భారత మార్కెట్‌కు సరిపడే విధంగా ఈ బైక్‌లో శారీ గార్డ్‌, ముందు భాగంలోని నెంబర్‌ ప్లేట్‌ వంటి మార్పులు చేశాం.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 5th October 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టైటాన్‌ కంపెనీ:- ఈ ఆర్థిక సంవత్సరం తొలి సంవత్సరం వ్యాపార లావాదేవీల సమాచారాన్ని ఎక్స్సేంజ్‌లకు నివేదించింది.  క్యుపిడ్:- బోనస్‌ షేర్ల ఇష్యూతో పాటు ఇతర వ్యాపార విషయాలను చర్చించేందుకు ఈ అక్టోబర్‌ 13న బోర్డు సమావేశం నిర్వహించనుంది. భూషణ్‌ స్టీల్‌:- ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 1.05 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తిని చేయగా, 1.14 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను విక్రయించింది. ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌:- నాన్‌

పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం

Friday 5th October 2018

వాషింగ్టన్‌: అవినీతి చర్యలకు పాల్పడిన పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం విధించింది. మోసపూరిత విధానాలకు పాల్పడిన మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌పై రెండేళ్ల వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన ఈ కంపెనీ... భారత్‌లో ప్రపంచ బ్యాంకుకు చెందిన ప్రాజెక్టులకు పనిచేస్తోంది. భారత్‌కు చెందిన ఓలివ్‌ హెల్త్‌కేర్‌, జే మోది కంపెనీలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Most from this category