STOCKS

News


సుజుకీ నుంచి 2 అధునాతన బైక్‌లు

Thursday 4th October 2018
auto-mobiles_main1538626651.png-20837

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా భారత మార్కెట్‌లో రెండు గ్లోబల్‌ ఫ్లాగ్‌షిప్‌ బైక్‌లను విడుదలచేసింది. ఆర్‌ఎం-జెడ్‌ 250 పేరిట విడుదలైన బైక్‌ ధర రూ.7.10 లక్షలు కాగా, ఆర్‌ఎం-జెడ్‌ 450 మోడల్‌ ధర రూ.8.31 లక్షలుగా నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచ్ఛిదా మాట్లాడుతూ.. ‘గత కొంత కాలంగా భారత్‌లో ఆఫ్‌-రోడింగ్‌ విభాగానికి చెందిన బైక్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. సాహసోపేతమైన రైడింగ్‌ కోరుకునేవారి సంఖ్య ఊపందుకుంటోంది. ఈ కారణంగానే నేటితరం యువత అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకున్న ఈ బైక్‌లను విడుదలచేశాం.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

జెట్‌ ఉద్యోగులకు జీతాల్లేవ్‌..!

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో మరోసారి ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయ్యాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,300 కోట్ల నష్టాలను ప్రకటించి, వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలను నమోదుచేసిన ఈ సంస్థ.. కనీసం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారింది. రూ.75వేలకు మించి జీతాలు ఉన్నటువంటి ఏ1-ఏ5, ఓ2, ఓ3 గ్రేడ్‌ ఉద్యోగులకు అక్టోబరు ఒకటిన జీతాలు అందగా.. ఎం1, ఎం2,

జేబీ కెమికల్స్‌ షేర్ల బైబ్యాక్‌ 10 నుంచి

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 24న ముగిసే ఈ బైబ్యాక్‌ ఆఫర్‌ ‍ద్వారా 33.33 లక్షల షేర్లను కొనుగోలు చేస్తామని జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.390 ధర చొప్పున ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.130 కోట్లని వివరించింది. షేర్ల బైబ్యాక్‌ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో జేబీ

Most from this category