STOCKS

News


ఎస్‌ఎంఎల్‌ ఇసుజు నుంచి గ్లోబల్ సిరీస్ ట్రక్కులు

Saturday 8th September 2018
auto-mobiles_main1536381188.png-20080

బెంగళూరు: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఎస్‌ఎంఎల్‌ ఇసుజు దక్షిణ భారతదేశ మార్కెట్‌లో అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన లారీలను శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుత భాతర లారీ పరిశ్రమకు సరిగ్గా సరిపడే విధంగా గ్లోబల్ సిరీస్ (జీఎస్‌) టక్కులను ప్రవేశపెట్టినట్లు వెల్లడించిన ఈ సంస్థ.. తమ నూతన టెక్నాలజీ ద్వారా రియల్-టైమ్ వాహన ట్రాకింగ్, వ్యయ నియంత్రణ, ఉత్తమ లోడింగ్‌ సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉన్నట్లు వివరించింది. ఈ సందర్భంగా కంపెనీ జనరల్‌ మేనేజర్‌ నవీన్‌ కుమార్‌ శర్మ మాట్లాడుతూ.. ‘అత్యంత అధునాతన రోబోటిక్ టెక్నాలజీతో వాహనాలు రూపుదిద్దుకున్నాయి. ఎస్‌ఎంఎల్‌ సారతి పేరిట అందిస్తున్న టెలీమాటిక్స్ సొల్యూషన్ ఆన్‌ రోడ్‌ సర్వీస్‌ వంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. లారీ క్యాబిన్‌ సైతం డ్రైవర్‌కు మరింత సౌకర్యంగా ఉంది.’ అని వివరించారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఈ లారీలను పూర్తిస్థాయిలో ఇక్కడే ఉత్పత్తి చేయనున్నట్లు తెలియజేశారు. 



You may be interested

మీ వ్యాపార విధానమేంటో చెప్పండి

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: భారత్‌లో అనుసరించబోయే వ్యాపార విధానాన్ని గురించి వివరించాలంటూ అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌, దేశీ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లను నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. సెప్టెంబర్ 29లోగా దీనిపై తగు వివరణనివ్వాలంటూ వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కు సూచించింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తు అపీల్ వేసిన వ్యాపార సంస్థల సమాఖ్య సీఏఐటీకి

2022 నాటికి రూ.7,00,000 కోట్లు

Saturday 8th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో ఈ-కామర్స్‌ వ్యాపారం 2022 నాటికి రూ.7,00,000 కోట్లకు చేరుతుందని నాస్కాం-పీడబ్ల్యుసీ నివేదిక చెబుతోంది. ‘ప్రపంచ నాయకత్వం దిశగా భారత ఈ-కామర్స్‌’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం... ‘‘ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్‌ మార్కెట్‌ పరిమాణం రూ.2,45,000 కోట్లు. వచ్చే అయిదేళ్లు పరిశ్రమ ఏటా 25 శాతం వృద్ధి చెందుతుంది. ఈ-టైల్‌, ఈ-ట్రావెల్‌ వాటా 90 శాతం పైగా ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసులు వేగంగా

Most from this category