STOCKS

News


మార్చిలో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌

Tuesday 13th November 2018
auto-mobiles_main1542085473.png-21933

సియోల్‌: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా తమ తొలి ఫోల్డబుల్ (మడతపెట్టేందుకు అనువైన) స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టాలని దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యోచిస్తోంది. గెలాక్సీ ఎస్‌10లో 5జీ వెర్షన్‌తో పాటు దీన్ని కూడా ఆవిష్కరించాలని కంపెనీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా ఫిబ్రవరిలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో గెలాక్సీ ఎఫ్‌ పేరుతో ఈ ఫోన్‌ను ప్రదర్శించే అవకాశముందని వివరించాయి. దీని ధరను కంపెనీ ఇంత వరకూ వెల్లడించకపోయినప్పటికీ.. సుమారు 1,770 డాలర్లు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారీ రేటు కారణంగా అమ్మకాలు పరిమిత స్థాయిలోనే ఉండొచ్చని భావిస్తున్నాయి. ఇందులో 7.4 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. మడిస్తే సాధారణ స్మార్ట్‌ఫోన్‌ సైజులో 4.6 అంగుళాలకు తగ్గుతుంది. అయితే, ఇది 5జీ నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఉండకపోవచ్చని పరిశ్రమవర్గాల అంచనా. 



You may be interested

లీజుకు పాదూరు చమురు గిడ్డంగి

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: కర్ణాటకలోని పాదూరులో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వ కేంద్రంలో కొంత భాగాన్ని అబు ధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ) లీజుకు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆ కంపెనీ సోమవారం భారత ప్రభుత్వంతో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఏడీఎన్‌వోసీతో ఈ ఏడాది కుదుర్చుకున్న డీల్స్‌లో ఇది రెండోది. అత్యవసర పరిస్థితుల కోసం

జీఎస్‌ఎంఏ బోర్డులో 3 దేశీ టెల్కో దిగ్గజాలు

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య జీఎస్‌ఎంఏ బోర్డులో మూడు దేశీ ప్రైవేట్‌ టెల్కో దిగ్గజాలు చోటు దక్కించుకున్నాయి. భారతి ఎయిర్‌టెల్‌ ఎ౾ండీ, సీఈవో గోపాల్ విఠల్‌, రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్‌, వొడాఫోన్ గ్రూప్ సీఈవో (ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా-పసిఫిక్ ప్రాంతం) వివేక్ బద్రినాథ్ జీఎస్‌ఎంఏ బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. వొడాఫోన్ ఐడియా బోర్డులో బద్రినాథ్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కూడా ఉన్నారు. దీంతో మొత్తం మూడు

Most from this category