News


స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో ‘శాంసంగ్‌’ టాప్‌

Thursday 4th October 2018
auto-mobiles_main1538626892.png-20841

న్యూఢిల్లీ: ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ విభాగ అమ్మకాల్లో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రీమియం సెగ్మెంట్‌ ఆగస్టు విక్రయాల్లో ఈ సంస్థ విలువ పరంగా 60 శాతం మార్కెట్‌ వాటాను, సంఖ్య పరంగా 62.5 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు.. జర్మనీకి చెందిన మార్కెట్‌ పరిశోధన సంస్థ జీఎఫ్‌కే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మార్కెట్‌ వాటా ఆగస్టులో ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం ‘శాంసంగ్‌ నోట్‌ 9’ విడుదలేనని అధ్యనంలో తేలింది. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన శాంసంగ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ ఆదిత్య.. ‘నెంబర్‌ స్థానానికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 24న నోట్‌ 9 విడుదల జరిగినప్పటికీ, అదే నెల 10 నుంచే రూ.6,000 క్యాష్‌ బ్యాక్‌ వంటి పలు ఆఫర్లతో ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభించడం వల్ల ఇది సాధ్యపడింది. అక్టోబర్‌-డిసెంబర్‌ పండుగల సీజన్‌లో 20-25 శాతం వృద్ధిరేటును అంచనావేస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. రూ.40,000 మించిన స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో 55.5 శాతం, రూ.30,000 మించిన స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో 55 శాతం మార్కెట్‌ వాటాను ఆగస్టులో ఈ సంస్థ కైవసం చేసుకుంది. ఇక అక్టోబర్‌ 11న రూ.30,000 స్థాయి మించిన స్మార్ట్‌ఫోన్‌ ఏ9 విడుదలకానుంది.



You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ రూ. 21 కోట్ల డిఫాల్ట్‌

Thursday 4th October 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో భాగమైన ఐఎల్అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్‌ (ఐటీఎన్‌ఎల్‌) దాదాపు రూ. 21 కోట్లు డిఫాల్ట్‌ అయింది. మూడు నాన్‌ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ)పై వడ్డీ చెల్లింపులు జరపలేకపోయినట్లు సంస్థ తెలిపింది. జూన్‌ 30 నుంచి సెప్టెంబర్ 29 మధ్యలో వీటిని చెల్లించాల్సి ఉన్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. 19 సిరీస్ బీ కింద రూ. 10.58 కోట్లు, 19ఎం సిరీస్ ఏపై రూ.

ఇప్కా ల్యాబ్స్‌ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: ఇప్కా ల్యాబొరేటరీస్‌ అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ బేషోర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎల్‌ఎల్‌సీలో 80 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను అమెరికాలోని తమ అనుబంధ కంపెనీ ఇప్కా ఫార్మాస్యూటికల్స్‌ ఇన్‌కార్పొ  రూ.74.40 కోట్లకు (10.286 మిలియన్‌ డాలర్లకు) కొనుగోలు చేసిందని ఇప్కా ల్యాబొరేటరీస్‌ వెల్లడించింది. తమ జనరిక్స్‌ ఔషధాలను అమెరికాలో బేషోర్‌ ఫార్మా ద్వారా విక్రయిస్తామని పేర్కొంది. 2017, డిసెంబర్‌ 31తో ముగిసిన ఏడాది కాలానికి బేషోర్‌

Most from this category