STOCKS

News


శామ్‌సంగ్‌ నుంచి కొత్త వాషింగ్ మెషీన్లు

Saturday 27th October 2018
auto-mobiles_main1540610009.png-21512

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ శామ్‌సంగ్‌ హైదరాబాద్‌ మార్కెట్లో నూతన శ్రేణి వాషింగ్‌ మెషీన్లను ప్రవేశపెట్టింది. 6.5 నుంచి 16 కేజీల శ్రేణిలో మొత్తం 12 మోడళ్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.24,490 నుంచి మొదలవుతున్నాయి. ఇందులోని డిజిటల్‌ ఇన్వర్టర్‌ డైరెక్ట్‌ డ్రైవ్‌ మోటార్‌ 40 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుందని కంపెనీ కంజ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగం డీజీఎం మనీష్‌ శర్మ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘2017లో వాషింగ్‌ మెషీన్ల విక్రయాల్లో 12-15 శాతం వృద్ధి నమోదు చేశాం. ప్రస్తుత ఏడాది రెండింతల వృద్ధి లక్ష్యంగా చేసుకున్నాం’ అని చెప్పారు. 



You may be interested

కోరమాండల్‌ లాభం రూ.366 కోట్లు

Saturday 27th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో క్రితంతో పోలిస్తే నికరలాభం సుమారు 5 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరింది. టర్నోవరు 36 శాతం అధికమై రూ.5,018 కోట్లకు ఎగసింది. ‘దక్షిణాదిన రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగాయి. ఈశాన్య రుతుపవనాలు సాధారణంగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఏడాది రెండో భాగం అనుకూలంగా ఉంటుంది’ అని కంపెనీ ఎండీ సమీర్‌ గోయల్‌

రెండు గంటల్లో ముంగిట్లోకి ‘ఖట్టా మీఠా’

Saturday 27th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నచ్చిన స్వీట్స్‌ కోసం కొన్ని షాపులకే వెళతాం. అక్కడికెళ్లే అవకాశం లేకపోతే ఫుడ్‌ అగ్రిగేటర్ల ద్వారా ఆన్‌లైన్లో ఆర్డరివ్వొచ్చు. కానీ అవి నిర్దేశిత పరిధి వరకే డెలివరీ చేస్తాయి. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ‘ఖట్టా మీఠా’ ఒక అడుగు ముందుకేసింది. వినియోగదారులు సిటీలో ఏ మూలనున్నా టాప్‌ దుకాణాల నుంచి రెండు గంటల్లో డెలివరీ చేస్తోంది. స్వీట్స్, నమ్‌కీన్స్, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు ఆర్డర్లు తీసుకుంటోంది.

Most from this category