STOCKS

News


నాలుగు కెమెరాల శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌

Wednesday 21st November 2018
auto-mobiles_main1542775109.png-22238

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్... తాజాగా గెలాక్సీ ఏ9 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 6జీబీ, 8జీబీ ర్యామ్‌లతో రెండు వెర్షన్లలో లభించే ఫోన్ల ధర దీని ధర వెర్షన్‌ను బట్టి రూ.36,990- రూ.39,900గా ఉంది. వెనుకవైపున నాలుగు కెమెరాలు ఉండటం ఈ ఫోన్‌ ప్రత్యేకత. 6.3 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్‌, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ (512 జీబీ దాకా పెంచుకోవచ్చు), 3,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్స్ ఉన్నాయి. వెనుకవైపు ప్రధానంగా 24 ఎంపీ, టెలిఫోటో (10 ఎంపీ), అల్ట్రా వైడ్ (8ఎంపీ), డెప్త్ (5ఎంపీ) కెమెరాలుంటాయి. ముందువైపున 24 ఎంపీ కెమెరా ఉంటుంది. ప్రపంచంలో నాలుగు కెమెరాల తొలి స్మార్ట్‌ఫోన్ తమదేనని, యువత అభిరుచులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించామని శాంసంగ్ ఇండియా జీఎం ఆదిత్య బబ్బర్ తెలియజేశారు. కన్సల్టెన్సీ సంస్థ జీఎఫ్‌కే గణాంకాల ప్రకారం రూ.30,000 పైబడిన స్మార్ట్‌ఫోన్ల కేటగిరీలో శాంసంగ్‌కు 58.4 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు. కౌంటర్‌పాయింట్‌ సంస్థ గణాంకాల ప్రకారం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనాకి చెందిన వన్‌ప్లస్ 30 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్ రెండో స్థానంలో (28 శాతం), యాపిల్ మూడో స్థానంలో (25 శాతం వాటా) ఉన్నాయి. 



You may be interested

డిసెంబరు 2 నుంచి ఇండియా జాయ్‌

Wednesday 21st November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: గేమింగ్‌, డిజిటల్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ రంగంలో ఆసియాలో భారీ ప్రదర్శన, సదస్సుకు హైదరాబాద్‌ వేదికవుతోంది. ఇండియా జాయ్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌, గేమింగ్‌ అసోసియేషన్‌ (త్వాగా) సహకారంతో డిసెంబరు 2 నుంచి 6 వరకు హెచ్‌ఐసీసీ, హైటెక్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇన్వెస్టర్లు, కార్పొరేట్‌ సంస్థలు,  స్టూడియోలు, కంటెంట్‌ డెవలపర్స్‌, హార్డ్‌వేర్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌, కస్టమర్లు, విద్యార్థులు దీనికి హాజరవుతారని త్వాగా

లాభాలు.. అంతలోనే నష్టాలు..

Wednesday 21st November 2018

10,670 వద్ద నిఫ్టీ ప్రారంభం సెన్సెక్స్‌ 18 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,656 పాయింట్లతో పోలిస్తే 14 పాయింట్ల లాభంతో 10,670 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,474 పాయింట్లతో పోలిస్తే 18 పాయింట్ల లాభంతో 35,492 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,336

Most from this category