STOCKS

News


శాంసంగ్‌ ఫోల్డబుల్ ఫోన్లో ఏమున్నాయి?

Saturday 10th November 2018
auto-mobiles_main1541831104.png-21863

దక్షిణ కొరియాకు చెందిన అగ్ర శ్రేణి ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ ఫోల్డబుల్ ఫోన్‌ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి వినియోగదారుల్లో చాలా తారా స్థాయిలోనే ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన శామ్‌సంగ్‌ డెవలపర్స్‌ సదస్సులో ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని అస్పష్ట వివరాలను కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ జస్టిన్‌ డెనిన్సన్‌ ఆవిష్కరించారు. చిన్న టాబ్లెట్‌ సైజులో జేబులో పట్టేంత పరిమాణంలోనే ఈ ఫోన్‌ ఉండనుంది. రానున్న నెలల్లోనే పెద్ద ఎత్తున తయారీకి సిద్ధమైనట్టు కంపెనీ ప్రకటించింది.  

డిస్‌ప్లే ఒకటే

ఫోల్డబుల్‌ ఫోన్‌ అంటే ఇప్పటికే జెడ్‌టీఈ ఆక్సాన్‌ ఎం అని ఒకటుంది. కానీ రెండు వేర్వేరు డిస్‌ప్లేలు ఇందులో ఉంటాయి. పుస్తకం మాదిరిగా మధ్యకి మడుచుకోవచ్చు. కానీ శామ్‌సంగ్‌ మడతేసే ఫోన్‌ మాత్రం ఒకే ఫ్లెక్సిబుల్‌ స్కీ‍్రన్‌తో రానుంది. ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లేతో ఇది ఉంటుంది. ఫోల్డబుల్‌ పరికరాల్లో స్క్రీన్‌ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. పగుళ్లు రానంద దృఢంగానూ ఉండాలి. కనుక ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లేను శామ్‌సంగ్‌ ఏ మెటీరియల్‌తో తయారు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్లాస్టిక్‌ ఓఎల్‌ఈడీ, ఎల్‌సీడీ అన్నవి ఎంపికలవుతాయని భావిస్తున్నారు. ఏక కాలంలో మూడు యాప్స్‌ను రన్‌ చేసుకునే వీలుగా శామ్‌సంగ్‌ మల్టీ యాక్టివ్‌ విండో ఇందులో ఉంటుంది. 

కెమెరా

ఫోన్లో వెనుక, ముందు భాగంలో వేర్వేరు కెమెరాలు కాకుండా ఒక్కటే కెమెరాను ఏర్పాటు చేసి, దాన్నే రెండు విధాలుగా వాడుకునే అవకాశం కల్పించనున్నట్టు అంచనా వేస్తున్నారు. మొత్తానికి శామ్‌సంగ్‌ మడత కాజా లాంటి ఫోన్‌ ధర 1,000 డాలర్ల పేనే ఉండొచ్చని అంచనా. అంటే మన రూపాయిల్లో రూ.73,000కుపైనే. అన్ని వివరాలకు, ఫోన్‌ విడుదల వరకు ఆగాల్సిందే. 



You may be interested

నెలరోజుల కనిష్టానికి పతనమైన పసిడి ధర

Saturday 10th November 2018

డిసెంబర్‌లో కీలకవడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం రాత్రి నెలరోజుల కనిష్టానికి పతనమయ్యాయి. గతరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ఏకంగా 16 డాలర్లు(1.30శాతం) నష్టపోయి 1210.30 డాలర్ల వద్ద ముగిసింది. ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ ఈసారి వడ్డీరేట్లపై యథాతద వైఖరిని అవలంభించింది. అయితే, ఈ డిసెంబర్‌లో కీలకవడ్డీ రేట్ల పెంపు కచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఊపందుకున్నాయి. వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో రాత్రి

ప్రభుత్వరంగ స్టాక్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి

Saturday 10th November 2018

అధిక డివిడెండ్‌ రాబడి, షేర్ల బైబ్యాక్‌లు, సెప్టెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ఇవన్నీ కలసి ప్రభుత్వరంగ కంపెనీల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగిపోతోంది. మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఉండడంతో ఈ సమయంలో ప్రభుత్వరంగ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు భద్రంగా భావిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ సెప్టెంబర్‌ 21 నుంచి చూస్తే కేవలం 2 శాతమే పడిపోవడం ఇందుకు నిదర్శంగా చెబుతున్నారు. కానీ, ఇదే కాలంలో సెన్సెక్స్‌ ఏడు శాతం

Most from this category