STOCKS

News


హైదరాబాద్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వింటేజ్‌ స్టోర్‌

Friday 14th December 2018
auto-mobiles_main1544763046.png-22913

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హైదరాబాద్‌లో వింటేజ్‌ స్టోర్‌ను త్వరలో ప్రారంభిస్తోంది. ప్రీ-ఓన్డ్‌ (పాత) వాహనాలను ఈ కేంద్రంలో విక్రయిస్తారు. 91 రకాల నాణ్యత పరీక్షలు జరిపి, వారంటీతో వాహనాలను అమ్ముతామని కంపెనీ ఇండియా బిజినెస్‌ హెడ్‌ షాజీ కోషీ తెలిపారు. ఇంటర్‌సెప్టర్‌ ఐఎన్‌టీ 650, కాంటినెంటల్‌ జీటీ 650 మోడళ్లను గురువారమిక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా సంస్థకు 870 డీలర్‌షిప్‌ కేంద్రాలు ఉన్నాయి. రెండు రోజులకో సెంటర్‌ను ప్రారంభిస్తున్నాం. 250-750 సీసీ సెగ్మెంట్లోనే పోటీపడతాం. ఇప్పటి వరకు 35 లక్షల కస్టమర్లున్నారు. భారత్‌లో గతేడాది 8 లక్షల పైచిలుకు బైక్‌లు రోడ్డెక్కాయి. 250 సీసీ ఆపై సామర్థ్యమున్న బైక్‌ల విభాగంలో తెలంగాణ, ఏపీలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు 91 శాతం వాటా ఉంది. సంస్థ మొత్తం విక్రయాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 6-7 శాతముంటుంది. ఈ రాష్ట్రాలు టాప్‌-5లో నిలిచాయి’ అని వివరించారు. భారత్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తొలి స్టోర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటైందని గుర్తు చేశారు.



You may be interested

యూబీఎస్‌ టెక్నాలజీతో విడుదలైన యమహా శాల్యుటో

Friday 14th December 2018

న్యూఢిల్లీ: ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థతో అభివృద్ధి పరచిన రెండు శాల్యుటో మోడల్‌ బైక్‌లను గురువారం విడుదలచేసింది. ఏకీకృత బ్రేకింగ్ వ్యవస్థ (యూబీఎస్‌) కలిగిన శాల్యుటో, శాల్యుటో ఆర్‌ఎక్స్‌ మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. డ్రమ్‌, డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్లలో ఈ వ్యవస్థ అందుబాటులో ఉండగా.. శాల్యుటో (125 సీసీ) బైక్‌ ధరల శ్రేణి రూ.58,800 – రూ.61,500 స్థాయిలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. శాల్యుటో ఆర్‌ఎక్స్‌

రెండు రోజుల్లోనే మొబైల్ నంబర్ పోర్టింగ్

Friday 14th December 2018

న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ చర్యలు ప్రకటించింది. ఒకే సర్వీస్ ఏరియా పరిధిలో నంబరును పోర్ట్‌ చేసేందుకు గడువును రెండు రోజులకు పరిమితం చేసింది. అలాగే, ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్‌కు పోర్ట్‌ అవుట్ వ్యవధిని నాలుగు రోజులుగా నిర్దేశించింది. యూజర్లకు అనుకూల విధానాల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాయ్ తెలిపింది.

Most from this category