STOCKS

News


థండర్‌బర్డ్‌ 500ఎక్స్‌లో ఏబీఎస్‌ వేరియంట్‌

Thursday 29th November 2018
auto-mobiles_main1543479820.png-22485

  • ధర రూ.2.13 లక్షలు

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన పోర్ట్‌ఫోలియోలోని బైక్స్‌ను 2019 ఏప్రిల్‌ నుంచి అమలులోకి రానున్న కొత్త భద్రతా ‍ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్‌ చేసుకుంటోంది. కంపెనీ అందులో భాగంగా తాజాగా థండర్‌బర్డ్‌ 500ఎక్స్‌లో ఏబీఎస్‌ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి మార్కెట్‌లోకి రానున్న 125 సీసీ, అటుపై ఇంజిన్‌లను కలిగిన బైక్స్‌కు ఏబీఎస్‌ (యాంటీ బ్రేక్‌ లాక్‌ సిస్టమ్‌) ఫీచర్‌ తప్పనిసరి. ఇక 125 సీసీ కన్నా తక్కువ సామర్థమున్న బైక్స్‌లో సీబీఎస్‌ (కాంబి బ్రేకింగ్‌ సిస్టమ్‌) ఫీచర్‌ కచ్చితంగా ఉండాలి. అందువల్ల రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌ అన్ని 125 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యమున్నవే. 
ఇకపోతే థండర్‌బర్డ్‌ 500ఎక్స్‌లో ఏబీఎస్‌ మినహా ఎటువంటి మార్పులు లేవు. ఇందులో 499 సీసీ సింగిల్‌ సిలిండర్‌, 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ థండర్‌బర్డ్‌ 500 ఎక్స్‌ ఏబీఎస్‌ వేరియంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.13 లక్షలుగా ఉంది. నాన్‌-ఏబీఎస్‌ వేరియంట్‌ ధర దీని కన్నా రూ.14,000 తక్కువగా ఉంది. 



You may be interested

కొనదగిన 3 స్టాక్స్‌..

Thursday 29th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. సిప్లా ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. బై రేటింగ్‌ కొనసాగిస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.680గా నిర్ణయించాం. కంపెనీ క్యూ2 ఫలితాలు తమ అంచనాల కన్నా దిగువునే ఉన్నాయి. వార్షికంగా చూస్తే సిప్లా నికర లాభం 16 శాతం, రెవెన్యూ 2 శాతం క్షీణించింది. మార్జిన్లు కూడా 17.5 శాతానికి తగ్గాయి. హై-బేస్‌ కారణంగా దేశీ వ్యాపారం

హానర్‌ కొత్త ఫోన్‌.. ‘8సీ’

Thursday 29th November 2018

ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హానర్‌’ తాజాగా ‘8సీ’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.11,999 నుంచి ప్రారంభమౌతోంది. స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు డిసెంబర్‌ 10 నుంచి ప్రారంభమౌతాయి. ఇవి కేవలం అమెజాన్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. హానర్‌ 8సీ లోని ప్రత్యేకతలను గమనిస్తే..  ► 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ► క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 632 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ (ప్రపంచంలోనే ఈ ప్రాసెసర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే) ► 13 ఎంపీ+

Most from this category